సెనేట్ లో ట్రంప్ అభిశంసనపై విచారణ, డెమొక్రాట్లు వాడిన పదంపై రభస, లాయర్ల వీడియో ప్రదర్శన

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశంసనకు సంబంధించి విచారణ సెనేట్ లో కొనసాగుతోంది. తమ క్లయింటు (ట్రంప్) ను 'కాపాడేందుకు' ఆయనతరఫు లాయర్లు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.

సెనేట్ లో ట్రంప్ అభిశంసనపై విచారణ, డెమొక్రాట్లు వాడిన పదంపై రభస, లాయర్ల వీడియో ప్రదర్శన
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Feb 13, 2021 | 4:30 PM

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశంసనకు సంబంధించి విచారణ సెనేట్ లో కొనసాగుతోంది. తమ క్లయింటు (ట్రంప్) ను ‘కాపాడేందుకు’ ఆయనతరఫు లాయర్లు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అధ్యక్ష ఎన్నికల సందర్భంగా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ సహా పలువురు డెమొక్రాట్లు తమ ప్రచార ప్రసంగాల్లో ‘ఫైట్’ అన్న పదాన్ని కొన్ని వందలసార్లు వాడారట..అలా అని ట్రంప్ లాయర్లు ఓ వీడియోను చూపారు. జనవరి 6 న వాషింగ్టన్ లోని క్యాపిటల్ హిల్ వద్ద తన మద్దతుదారులను ఉద్దేశించి ట్రంప్.. ‘వీరోచితంగా ఫైట్ చేయండి’ అని వారిని రెచ్ఛగొట్టేట్టు ప్రసంగించారని మీరు అంటున్నారని, కానీ మీరు మాత్రం తక్కువ తిన్నారా..ఇదిగో చూడండి అంటూ ట్రంప్ లాయర్ డేవిడ్ షోన్ అన్నారు. మీ హిపోక్రసీ ఇప్పటికైనా బయటపడిందన్నారు.trump's impeachement defence team shows video of democrats using word fight, us, senate, former president donald trump, president joe biden, senate, fight, trump defence team videoడెమొక్రాట్ ఎంపీల ప్రచార ర్యాలీల సందర్భాల్లోనూ, టీవీ స్థూడియోల్లో వారు ఇఛ్చిన ఇంటర్వ్యూల సందర్భాల్లో కూడా ఈ పదాన్ని వాడడం సుమారు 11 నిముషాల ఈ వీడియోలో కనిపించింది. పలు అంశాలపై ట్రంప్ తో పోరాడండి అంటూ డెమొక్రాట్లు ప్రాసిక్యూటర్ల మాదిరి వ్యాఖ్యానించారని ఈ మాంటెజీ క్లిప్ లో చూపారు. జోబైడెన్ సైతం తన మద్దతుదారులతో.. ఈ పోరాటాన్ని ఎన్నడూ ఆపకండి అని హితబోధ కూడా చేశారట.. కానీ ఈ వీడియోను డెమొక్రాట్లు అపహాస్యం చేస్తూ.. ఫైట్ అంటే ఇక్కడ ట్రంప్  విధానాలపై పోరాటం జరపాలని, ఎన్నికల ఫలితాలను ఆయన మార్చడానికి చేస్తున్న ప్రయత్నాలను ఎదుర్కోవాలని అన్న ఉద్దేశమేనని వివరించారు.  అంతే తప్ప ఆయనపై ఫైట్ చేయాలన్నది కాదన్నారు.

మరిన్ని చదవండి ఇక్కడ:  ఢిల్లీలో జాతీయ భద్రతా సలహాదారు కార్యాలయాన్ని రెక్కీ చేశా, జైషే టెర్రరిస్ట్ ఒప్పుకోలు

మరిన్ని చదవండి ఇక్కడ : మన అత్యంత ప్రియనేస్తం రేడియో! మన ఆనంద విషాదాల్లో పాలు పంచుకునే చుట్టం రేడియో!