ఢిల్లీలో జాతీయ భద్రతా సలహాదారు కార్యాలయాన్ని రెక్కీ చేశా, జైషే టెర్రరిస్ట్ ఒప్పుకోలు

ఢిల్లీలో తాను జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కార్యాలయం వద్ద, ఇతర ప్రధాన ఆఫీసుల వద్ద రెక్కీ నిర్వహించినట్టు జైషే మహమ్మద్ ఉగ్రవాది హిదాయత్ ఉల్లా మాలిక్ తెలిపాడు.

ఢిల్లీలో జాతీయ భద్రతా సలహాదారు కార్యాలయాన్ని రెక్కీ చేశా, జైషే టెర్రరిస్ట్ ఒప్పుకోలు
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Feb 13, 2021 | 3:47 PM

ఢిల్లీలో తాను జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కార్యాలయం వద్ద, ఇతర ప్రధాన ఆఫీసుల వద్ద రెక్కీ నిర్వహించినట్టు జైషే మహమ్మద్ ఉగ్రవాది హిదాయత్ ఉల్లా మాలిక్ తెలిపాడు. జమ్మూ కాశ్మీర్ లో షోపియన్ జిల్లాకు చెందిన ఇతడిని కాశ్మీర్ పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. తమ విచారణలో ఇతడు చెప్పిన విషయాలు విని పోలీసులు దిగ్భ్రాంతి చెందారు. 2019  మే 24 న తాను శ్రీనగర్ నుంచి ఢిల్లీకి విమానంలో వెళ్లానని, అక్కడి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కార్యాలయాన్ని, సీఐ ఎస్ ఎఫ్ సిబ్బందిని వీడియో తీసి రెక్కీ నిర్వహించానని హిదాయతుల్లా చెప్పాడు. వాట్సాప్ ద్వారా ఈ వీడియోను పాకిస్తాన్ లోని తన సహచరునికి పంపానని వెల్లడించాడు. ఆ సహచరుడిని ఓ ‘డాక్టర్’ గా పేర్కొన్నాడు. పైగా పాక్ లోని తన  మిత్రులైన 10 మంది కోడ్ పేర్లను, ఫోన్ నెంబర్లను కూడా ఇతగాడు వెల్లడించినట్టు పోలీసులు చెప్పారు. ఇతడి నుంచి వారు రెండు పిస్టల్స్ సహా ఇతర ఆయుధాలను, మందుగుండు సామాగ్రిని, గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నారు. వీటితో బాటు కొన్ని కీలక పాత్రాలు కూడా తాము స్వాధీనం చేసుకున్న వాటిలో ఉన్నట్టు వారు తెలిపారు.

లష్కరే ముస్తఫా అనే ఉగ్రవాద సంస్థకు ఇతడు చీఫ్ అని, ఈ సంస్థ కూడా జైషే సంస్థకు అనుబంధంగా పని చేస్తోందని వారు చెప్పారు. ఈ నెల 6 న హిదాయతుల్లా ను అరెస్టు చేశారు. ఇతని వెనుక మరికొందరు టెర్రరిస్టులు కూడా ఉండవచ్ఛునని  భావిస్తున్నారు.

మరిన్ని చదవండి ఇక్కడ: ఈ దేశానికి ప్రమాదకరమైన వ్యక్తి,, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫైర్

మరిన్ని చదవండి ఇక్కడ:కోవిడ్ భయంతో ఇండియా నుంచి పరాయి దేశాలకు బడాబాబుల ‘క్యూ’, పెరిగిన ‘లెక్క’ !

Latest Articles