‘మాతా పిత పూజా దినోత్సవం’గా వేలంటైన్స్ డే, శ్రీరామ్ సేన నినాదం, పబ్ లు, పార్కులపై నిఘా

వేలంటైన్స్ డే (ప్రేమికుల రోజు) అన్నది పాశ్చాత్య సంస్కృతి అని, దీని పేరిట యువతను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారని శ్రీరామ్ సేన చీఫ్ ప్రమోద్ ముతాలిక్ ఆరోపించారు.

'మాతా పిత పూజా దినోత్సవం'గా  వేలంటైన్స్ డే, శ్రీరామ్ సేన నినాదం, పబ్ లు, పార్కులపై నిఘా
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Feb 13, 2021 | 7:40 PM

వేలంటైన్స్ డే (ప్రేమికుల రోజు) అన్నది పాశ్చాత్య సంస్కృతి అని, దీని పేరిట యువతను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారని శ్రీరామ్ సేన చీఫ్ ప్రమోద్ ముతాలిక్ ఆరోపించారు. ఫిబ్రవరి 14 వేలంటైన్స్ డే ని తాము మాతా పిత పూజా దినోత్సవంగా పాటిస్తామని ఆయనచెప్పారు. ముఖ్యంగా వేలంటైన్స్ డే సెలబ్రేషన్స్ పేరిట   కర్ణాటకలో వివిధ చోట్ల జరిగే అసభ్యకర కార్యక్రమాలను అడ్డుకునేందుకు తమ వలంటీర్లను నియమిస్తామని ఆయన చెప్పారు. ప్రతి ఏడాదీ తాము రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజును మాతా పిత దినోత్సవంగా నిర్వహిస్తాం.. తలిదండ్రులను గౌరవించే రోజుగా పరిగణిస్తాం అని ఆయన చెప్పారు. కర్ణాటకలో 60 నుంచి 70 చోట్ల ఈ విధమైన కార్యక్రమాలు జరుగుతాయన్నారు.

పబ్ లు, బార్లు , ఐస్ క్రీమ్ పార్లర్లు, పార్కులు వంటివాటిపై తమ సభ్యుల నిఘా ఉంటుందని ప్రమోద్ ముథాలిక్ తెలిపారు. అయితే వారు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోబోరని, అసభ్యకర కార్యక్రమాలను అడ్డుకోవడానికి పోలీసులకు సహకరిస్తారని ఆయన వివరించారు. కాగా- ఎవరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకుండా చూస్తామని బెంగుళూరు పోలీసులు తెలిపారు. 2009లో వేలంటైన్స్ డే నాడు శ్రీరామ్ సేన వలంటీర్లు మంగుళూరులోని ఓ పబ్ లోడ్యాన్సులు చేస్తున్న యువతీ యువకులపై దాడి చేసిన విషయం గమనార్హం. భారతీయ సంస్కృతిని వారు భ్రష్టు పట్టిస్తున్నారని సేన సభ్యులు ఆరోపించారు. 2018 లో ఈ విధమైన ఘటన సందర్భంలో ప్రమోద్ ముతాలిక్ ని పోలీసులు అరెస్టు చేశారు.

మరిన్ని చదవండి ఇక్కడ: ‘వ్యవసాయం భారత మాతదే, పారిశ్రామికవేత్తలది కాదు’, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ

మరిన్ని చదవండి ఇక్కడ: జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ బిల్లుకు లోక్ సభ ఆమోదం, తగిన సమయంలో రాష్ట్ర ప్రతిపత్తి