Crime News: మరో ఎనిమిది రోజుల్లో కూతురు పెళ్లి.. అంతలోని దారుణానికి పాల్పడిన కన్నతండ్రి..
Crime News: ఛండీఘర్‌లో దారుణం చోటు చేసుకుంది. మరో ఎనిమిది రోజుల్లో కూతురు పెళ్లి ఉండగా.. ఓ వ్యక్తి తన కూతురుని, భార్యను అత్యంత..
Crime News: ఛండీఘర్‌లో దారుణం చోటు చేసుకుంది. మరో ఎనిమిది రోజుల్లో కూతురు పెళ్లి ఉండగా.. ఓ వ్యక్తి తన కూతురుని, భార్యను అత్యంత దారుణంగా చంపేశాడు. ఛండీఘర్ రాష్ట్రం లుథియానాలోని షేర్‌పూర్ కలాన్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి(65) సమీప ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడు. ఫిబ్రవరి 21న తన కూతురుకు పెళ్లి నిశ్చయం చేశారు. అయితే, కూతురుకు పెళ్లి అయితే తాము ఒంటరి అయిపోతామని భావించిన సదరు వ్యక్తి శుక్రవారం రాత్రి సమయంలో నిద్రిస్తు తన భార్య(60), తన కూతురు(60) లను సుత్తితో తలపై కొట్టి చంపేశాడు. అంతేకాదు.. వారి మరణాన్ని నిర్ధారించుకున్న తరువాత అతను కూడా సమీప నదిలో దూకాడు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. నదిలో దూకిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా అతని ఆచూకీ దొరకలేదని, అతని జాడ కోసం ప్రయత్నిస్తున్నామని లుథియానా అధికారులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also read: