Rinku Sharma Murder Case: రింకు శర్మ హత్య కేసులో ఐదుగురి అరెస్ట్.. ఆరోపణలను ఖండించిన ఢిల్లీ పోలీసులు
Rinku Sharma Murder Case: ఢిల్లీలోని మంగోల్‌పురిలో బీజేపీ యువ మోర్చా కార్యకర్త హత్య అనంతరం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంగోల్‌పురిలో గురువారం రాత్రి బీజేపీ యువ మోర్చా కార్యకర్త రింకు శర్మ..
Rinku Sharma Murder Case: ఢిల్లీలోని మంగోల్‌పురిలో బీజేపీ యువ మోర్చా కార్యకర్త హత్య అనంతరం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంగోల్‌పురిలో గురువారం రాత్రి బీజేపీ యువ మోర్చా కార్యకర్త రింకు శర్మ (25) ను కొందరు కలిసి హత్య చేశారు. అనంతరం ఈ హత్యకు సంబంధించి పార్టీల మధ్య వార్ కొనసాగుతోంది. అయితే ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. దీంతోపాటు వారిపై హత్య కేసు నమోదు చేసినట్లు పోలీసులు శనివారం వెల్లడించారు. కుటుంబసభ్యులు చేస్తున్న ఆరోపణలను పోలీసులు ఖండించారు. ఇదిలాఉంటే.. ఈ కేసును ఢిల్లీ క్రైం బ్రాంచ్‌కు అప్పగించారు.
ఢిల్లీలోని మంగోల్‌పురిలో గురువారం రాత్రి స్నేహితుడు డానిష్‌తో కలిసి రింకు శర్మ బర్త్‌డే పార్టీకి వెళ్లారు. ఏదో విషయంపై ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. పార్టీ అనంతరం డానిష్ మరో ముగ్గురు స్నేహితులతో కలిసి రింకు శర్మపై కత్తులతో దాడికి దిగారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ రింకుశర్మను స్థానికంగా ఉన్న ఓ ఆసుపత్రికి తరలించగా.. ఆయన చికిత్స పొందుతూ మృతి చెందాడు.
రింకు, డానిష్ ఇద్దరూ ఒకే ప్రాంతంలో నివసిస్తున్నారని.. ఇద్దరూ స్నేహితులేనని పోలీసులు వెల్లడించారు. గతేడాది ఇద్దరూ కలిసి బిజినెస్ ప్రారంభించి నష్టాలు రావడంతో మూసేశారని తెలిపారు. ఇదే విషయంపై ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని.. ఈ క్రమంలో బర్త్ డే పార్టీలో గొడవపడ్డారని చెప్పారు. అనంతరం డానిష్ అతని స్నేహితులతో కలిసి రింకు శర్మను హత్య చేశాడన్నారు. అయితే దీనిపై కుటుంబసభ్యులు పలు ఆరోపణలు చేయడంతో.. ప్రధాన పార్టీలైన బీజేపీ, ఆప్ మధ్య మాటల యుధ్దం ప్రారంభమైంది. అంతేకాకుండా బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కామెంట్లు చేయడంతో ఈ వివాదం మరింత రాజుకుంది.
Also Read: