Jonnalagadda Gurappa Chetty Death: ‘పద్మశ్రీ’ జొన్నలగడ్డ గుర్రప్పశెట్టి ఇకలేరు.. అనారోగ్యంతో కన్నుమూసిన బహుకళా కోవిదుడు
ప్రముఖ కలంకారీ కళాకారుడు, రచయిత, పెయింటర్ పద్మశ్రీ అవార్డు గ్రహీత జొన్నలగడ్డ గుర్రప్ప శెట్టి(75) తుదిశ్వాస విడిచారు. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న...
ప్రముఖ కలంకారీ కళాకారుడు, రచయిత, పెయింటర్ పద్మశ్రీ అవార్డు గ్రహీత జొన్నలగడ్డ గుర్రప్ప శెట్టి(75) తుదిశ్వాస విడిచారు. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో తన ఇంట్లో కన్నుమూశారు. కలంకారిలో అద్భుత నైపుణ్యం ప్రదర్శించడంతో 2008లో అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డుతో సత్కరించబడ్డారు. శ్రీకాళహస్తిలో కలంకారీ వృత్తిని మెరుగుపరిచి పలువురిని జాతీయ స్థాయి కళకారులుగా తీర్చిదిద్దారు. భారతరత్న మాల, భాగవత మాల, వ్రత పని(కలంకారీ) పుస్తకాలను ఆయన రచించారు.
శ్రీకాళహస్తిలో పద్మశ్రీ అవార్డు అందుకున్న ఏకైక వ్యక్తిగా జొన్నలగడ్డ గుర్రప్ప శెట్టి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయన మృతి పట్ల పలువురి సంతాపం వ్యక్తం చేశారు.
Also Read :
విషాదం.. ఇంట్లోంచి కవలల్ని ఎత్తుకెళ్లిన వానరం.. ఓ పసికందు మృతి.. మరొకరు…
Crime News: సోది చెబుతానంటూ వచ్చింది.. ఏకంగా 8 కాసులు బంగారం దోచుకెళ్లింది.. నటకిరీటి ఈ కి’లేడీ’