Weight Loss Tips: కొబ్బరి నూనేతో ఇలా చేస్తే ఈజీగా బరువు తగ్గుతారంట ? అదేలాగో తెలుసుకుందామా..

ప్రస్తుతం చాలా మంది ఉద్యోగ హాడివిడిలో పడి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోలేకపోతున్నారు. దీంతో దాదాపు చాలామంది ఊబకాయం సమస్యతో

Weight Loss Tips: కొబ్బరి నూనేతో ఇలా చేస్తే ఈజీగా బరువు తగ్గుతారంట ? అదేలాగో తెలుసుకుందామా..
Follow us

|

Updated on: Feb 15, 2021 | 4:08 PM

ప్రస్తుతం చాలా మంది ఉద్యోగ హాడివిడిలో పడి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోలేకపోతున్నారు. దీంతో దాదాపు చాలామంది ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. ఉద్యోగాలు చేస్తున్న యువతలో ఈ సమస్యతో ఇబ్బంది పడేవారు అధికమనే చెప్పుకోవాలి. సరైన సమయానికి తిండి తినకపోడవం.. ఎక్కువగా జంక్ ఫుడ్, బర్గర్లు తినడం వలన శరీరంలో కొవ్వు బాగా పెరుగిపోతుంది. దీంతో పెళ్లికాకముందే అధిక బరువు సమస్యతో బాధపడుతుంటారు. ఇక దాని నుంచి బయటపడేందుకు హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతుంటారు. ఇవే కాకుండా ఊబకాయం తగ్గించుకోవడానికి ఇంట్లో ఎన్నో విధాలుగా ట్రై చేసి ఉంటారు. కానీ కొబ్బరి నూనేతో ఇలా ట్రై చేస్తే తొందరగానే ఈ సమస్య నుంచి బయటపడోచ్చంట. అదేలానో తెలుసుకుందాం.

సాధరణంగా మనం కొబ్బరి నూనే అనగానే తలకు రాసుకుంటాం. అయితే కొబ్బరి నూనేతో వంటలు కూడా చేయ్యొచ్చు. కొబ్బరి నూనేను ఎక్కువగా మలయాళీలు వంటల్లో వాడుతుంటారు. ఇందుకోసం ప్రత్యేకమైన కొబ్బరి నూనే మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ఆ కొబ్బరి నూనేని తీసుకొని.. అందులోంచి ఒక స్పూన్ నూనేను.. అన్నంలో కలుపుకోవాలి. అరకిలో అన్నం వండుతుంటే.. పదిహేను గ్రాముల కొబ్బరి నూనేను ఎసరుకు పెట్టిన నీళ్ళలో కలపాలి. ఇలా వండిన అన్నం ఉడికిన తర్వాత దానిని ఫ్రిజ్ లో పెట్టాలి. ఆ తర్వాత దానిని తీసి.. కాస్త వేడి చేసి తినాలి. ఇలా చేయడం ద్వారా శరీరంలో ఉన్న కొవ్వును తగ్గింస్తుందట. ఈ అన్నం జీర్ణం కావడానికి చాలా సమయం తీసుకుంటుందట. దీనివలన శరీరంలో ఉన్న కొవ్వు తగ్గించడానికి సహయపడుతుంది. అలాగే కొంచెం తినగానే కడుపు నిండింది అనే ఫీలింగ్ కలుగుతుంది.. దీంతో సరైన సమయానికి అన్నం.. మితంగా తింటారు. బరువు తగ్గుతారు.

Also Read: ఇమ్యూనిటీ పెరగాలంటే ఇవి తప్పనిసరిగా తినాల్సిందే.. వీటితో కంటికి కనిపించని వైరస్ ఖతం..