AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇమ్యూనిటీ పెరగాలంటే ఇవి తప్పనిసరిగా తినాల్సిందే.. వీటితో కంటికి కనిపించని వైరస్ ఖతం..

కరోనా ఈ పేరు ప్రపంచాన్ని గడగడా వణికించింది. కంటికి కనిపించని ఈ వైరస్ ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారింది.

ఇమ్యూనిటీ పెరగాలంటే ఇవి తప్పనిసరిగా తినాల్సిందే.. వీటితో కంటికి కనిపించని వైరస్ ఖతం..
Rajeev Rayala
|

Updated on: Dec 22, 2020 | 10:23 PM

Share

కరోనా ఈ పేరు ప్రపంచాన్ని గడగడా వణికించింది. కంటికి కనిపించని ఈ వైరస్ ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారింది. లక్షల్లో ప్రజలు ఆసుపత్రిబారిన పడుతున్నారు. ఇక ఈ మహమ్మారి బారిన పడకుండా ఉండాలంటే శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచుకోవాలని వైద్యులు తెలుపుతున్నారు. అయితే ఎలాంటి ఆహరం తీసుకుంటే రోగనిరోధక శక్తి పెంపొందుతుంది అనేది ఒక్కసారి చూదాం..రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఎ, ఇ, డి, సి, బి విటమిన్లు, జింక్, సెలీనియం, ఐరన్, కాపర్ తదితర ఖనిజాలు, ఫైటోన్యూట్రియెంట్స్, అమైనో ఆమ్లాలు, ఫ్యాటీ ఆమ్లాలు కీలక పాత్ర పోషిస్తాయి. హానికారక సూక్ష్మ క్రిములను మనలోని రోగ నిరోధక వ్యవస్థ సమర్థంగా ఎదుర్కోవడంలో ఈ పోషకాలు కీలక పాత్ర పోషిస్తాయి. అందుకనే మనం తీసుకునే ఆహారపదార్ధాల్లో అవి ఉండేలా చూసుకోవాలి.

రోగ నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్ధాలకు ఇప్పుడు భారీ డిమాండ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. అయితే మొలకెత్తిన విత్తనాల ద్వారా కూడా రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు చెప్తున్నారు. మొలకెత్తిన గింజల్లో ఇనుము, క్యాల్షియం పుష్కలంగా ఉంటాయి. మొలకల్లో ఉండే విటమిన్ సీ తెల్లరక్తకణాలను ఉత్తేజితం చేస్తుంది. అలాగే నల్లద్రాక్ష, వేరుసెనగలు, పిస్తా, మల్బరీస్‌, స్ట్రా బెర్రీలు. వీటిని రెగ్యులర్‌గా తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

బొప్పాయి, జామ, ఆపిల్, ద్రాక్ష, మామిడితో పాటు అనేక రకాల పండ్లలో బీటా కెరోటిన్, సి, బి విటమిన్లు, పొటాషియం, ఫోలేట్ లాంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఆరోగ్యాన్ని, రోగనిరోధక శక్తిని మెరుగుపరచుకునేందుకు అవి ఎంతగానో సాయపడతాయి. ఇక విటమిన్‌ సి ఉన్న జామకాయ, బత్తాయి, కమలాపండు, నిమ్మకాయ, తదితర సిట్రస్ జాతి పండ్లలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ‌ఆకు కూరల్లో ముఖ్యంగా మునగాకు లో బీటా కెరోటీన్, విటమిన్ సీ, ఈ, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ ఎక్కువగా ఉంటాయ.అదేవిధంగా  వెల్లుల్లి, అల్లం, పసుపు, మిరియాలు వంటివి తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.