Kilauea Volcano Explosively : హవాయిలోని బద్దలైన కిలాయియా అగ్నిపర్వతం.. ఉవ్వెత్తున ఎగిసిన అగ్ని కీలలు..
అమెరికా పరిధిలో సముద్రంలో దూరంగా ఉండే హవాయిలో అగ్ని పర్వతం విస్పోటనం చెందింది. బిగ్ ఐలాండ్‌లోని కిలాయుయా అగ్నిపర్వతం పేలిపోడంతో అకాశంలో ఉవ్వెత్తున లావాతో కూడిన అగ్నికీలలు ఎగిసిపడ్డాయి.
అమెరికా పరిధిలో సముద్రంలో దూరంగా ఉండే హవాయిలో అగ్ని పర్వతం విస్పోటనం చెందింది. బిగ్ ఐలాండ్‌లోని కిలాయుయా అగ్నిపర్వతం పేలిపోడంతో అకాశంలో ఉవ్వెత్తున లావాతో కూడిన అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. అరుణ వర్ణంలో కనిపించిన అగ్ని కీలలు సుదూర ప్రాంతాల వరకూ కనిపించాయి. కిలాయుయా అగ్నిపర్వత పేలుడు ధాటికి ఆకాశంలో గ్యాస్, తేమ పెరిగాయి. బూడిద కూడా ఎగసిపడింది.
కిలాయియా అగ్నిపర్వతం బద్దలు కావడంతె లావా భారీగా విరజిమ్మతూ ధారాళంగా ప్రవహిచింది. ఇదంతా అక్కడే ఉన్న సరస్సులోకి ప్రవేశించింది. దీంతో అందులోకి నీరంతా అవిరైపోయింది. నీటితో లావా కలిస్తే పేలుడు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రెండు రోజుల పాటూ ఈ లావా మంటలు లావా ప్రవాహం కొనసాగిట్లు వారు వెల్లడించారు.
కిలాయియా అగ్నిపర్వతం పేలుడు మొదలైన గంట తర్వాత ఆ ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 4.4 తీవ్రత నమోదైంది. అయితే కిలాయియా అగ్నిపర్వత సమీపంలోని ప్రజలకు ఈ పేలుడు వల్ల పెద్దగా ఇబ్బంది తలెత్తలేదని అధికారులు చెబతున్నారు. పైగా ఈ దృశ్యాలను వారు ఎంతో ఆసక్తిగా తిలకించారు.
కాగా 2018లో కూడా ఈ ప్రాంతంలో అగ్ని పర్వతం ఇలాగే పేలింది. లావా ప్రవాహాలలో వందలాది గృహాలు ధ్వంసమయ్యాయి. ఈసారి పెద్దగా నష్టం లేకపోవడం ఊరట కలిగించింది. అగ్ని పర్వతం పేలినప్పుడు గాలిలో ఎగసిపడే బూడిద కళ్లకు, ఊపిరితిత్తులకు ప్రమాదకారమని అధికారులు హెచ్చరిస్తున్నారు