Sabarimala Darshan: శబరిమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. ప్రారంభమైన ఆన్‌లైన్ దర్శన టికెట్ల బుకింగ్..
శబరిమల వెళ్లే భక్తులకు ట్రావెన్కోర్ దేవసోం బోర్డు గుడ్ న్యూస్ అందించింది. భక్తుల సౌకర్యార్ధం ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి...

Sabarimala Online Booking 2021: శబరిమల వెళ్లే భక్తులకు ట్రావెన్కోర్ దేవసోం బోర్డు గుడ్ న్యూస్ అందించింది. భక్తుల సౌకర్యార్ధం ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి వర్చువల్ క్యూ బుకింగ్ ను ప్రారంభించింది. అయితే అయ్యప్ప స్వామి ఆలయాన్ని సందర్శించేవారు తప్పనిసరిగా తమ వెంట కోవిడ్-19 నెగటివ్ టెస్ట్ రిపోర్టును తీసుకురావాలని సూచించింది. డిసెంబర్ 26వ తేదీ నుంచి శబరిమల దర్శనం ప్రారంభమవుతుండగా.. ప్రతీ రోజూ 5000 మంది భక్తులకు దర్శనానికి అనుమతిస్తూ ఇప్పటికే మార్గదర్శకాలను జారీ చేశారు. ప్రతి ఏటా డిసెంబరు 26న మండలపూజ నిర్వహిస్తారు. జనవరి 14న మకరవిళక్కు నిర్వహించిన తర్వాత జనవరి 20న ఆలయాన్ని మూసేస్తారు. ఏటా ఈ కార్యక్రమాలకు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు హాజరై అయ్యప్ప దర్శనానికి పోటెత్తుతారు.
ఇదిలా ఉంటే కరోనా లాక్ డౌన్ కారణంగా ఆరు నెలలు పాటు శబరిమల ఆలయాన్ని మూసి ఉంచిన సంగతి తెలిసిందే. అన్ లాక్ ప్రక్రియ మొదలైన తర్వాత అక్టోబర్ లో భక్తుల కోసం తిరిగి ఆలయాన్ని తెరిచారు. మొదట్లో రోజుకు 1,000 మంది భక్తులకు అనుమతులు ఇవ్వగా, ఆ తర్వాత 2,000 మందికి, మళ్లీ ఆ సంఖ్యను 3000కు అధికారులు పెంచారు. ఇక ప్రస్తుతం 5 వేల మందికి అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. కాగా, శబరిమల దర్శనానికి వెళ్లే భక్తులు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని కేరళ ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసింది.
Also Read:
‘స్ట్రెయిన్’ వైరస్ వ్యాప్తిపై కేంద్రం క్లారిటీ.. ఒక్క కేసు కూడా నమోదు కాలేదని స్పష్టత..!
ఏపీ వాహనదారులకు అలెర్ట్.. జనవరి 1 నుంచి చలానాల బాదుడు షురూ.. లైట్ తీసుకుంటే ఇక అంతే.!
ఆన్‌లైన్ కాల్‌మనీపై సీఎం జగన్ సీరియస్.. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు..
‘సీబీఎస్‌సీ’ 10, 12వ తరగతుల బోర్డు పరీక్షలు వాయిదా.. కేంద్రమంత్రి కీలక ప్రకటన..!




