ఏపీ వాహనదారులకు అలెర్ట్.. జనవరి 1 నుంచి చలానాల బాదుడు షురూ.. లైట్ తీసుకుంటే ఇక అంతే.!!

ట్రాఫిక్ నిబంధనలను లైట్ తీసుకుంటున్నారా.? హెల్మెట్ ధరించడకుండా బైక్ నడుపుతున్నారా.? బండి డాక్యూమెంట్స్ అన్నీ కూడా పక్కాగా ఉన్నాయా.?

ఏపీ వాహనదారులకు అలెర్ట్.. జనవరి 1 నుంచి చలానాల బాదుడు షురూ.. లైట్ తీసుకుంటే ఇక అంతే.!!
Follow us

|

Updated on: Dec 22, 2020 | 7:10 PM

AP Government: ట్రాఫిక్ నిబంధనలను లైట్ తీసుకుంటున్నారా.? హెల్మెట్ ధరించడకుండా బైక్ నడుపుతున్నారా.? బండి డాక్యూమెంట్స్ అన్నీ కూడా పక్కాగా ఉన్నాయా.? ఒకవేళ ఎక్స్‌పైరీ డేట్ అయిపోతే.. వెంటనే రెన్యూవల్ చేయించుకోండి.! లేదంటే మీ పర్స్ ఖాళీ కావడం ఖాయం. జనవరి 1వ తేదీ నుంచి ఏపీలో ట్రాఫిక్ చలానాల బాదుడు షురూ కానుంది. ఇకపై బైక్ లేదా కారును తీసినా.. రోడ్డుపైకి వెళ్లాలంటే పర్మిట్, డ్రైవింగ్ లైసెస్స్, పొల్యూషన్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్ తప్పనిసరి. వాహనానికి సంబంధించిన డాక్యూమెంట్స్ ఏవి లేకపోయినా కేసులు నమోదు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రవాణా శాఖకు ఆదేశాలు జారీ చేసింది.

కోవిడ్ కారణంగా ఎక్స్‌పైరీ డేట్ అయిపోయిన పర్మిట్లు, రిజిస్ట్రేషన్లు, లైసెన్సుల గడువును కేంద్రం 2020 డిసెంబర్ నెలాఖరు దాకా పొడిగించిన సంగతి తెలిసిందే. మరికొన్ని రోజుల్లో ఆ గడువు ముగుస్తుండటంతో వచ్చే ఏడాది ప్రారంభం నుంచి స్ట్రిక్ట్ గా అమలు చేసేందుకు రాష్ట్ర రవాణాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీనితో చెక్ పోస్టుల వద్ద తనిఖీలు చేపట్టేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, 2019 సెప్టెంబర్ నుంచి కేంద్రం కొత్త ట్రాఫిక్ నియమాలను అమలులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. వాటి ప్రకారం ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు తప్పవు. వచ్చే ఏడాది ప్రారంభం నుంచి రవాణాశాఖకు సంబంధించిన పూర్తిస్థాయి తనిఖీలను చేపట్టనున్నట్లు ఇటీవలే రవాణాశాఖ సుప్రీంకోర్టు రోడ్‌ సేఫ్టీ కమిటీకి నివేదిక ఇచ్చింది.