కృష్ణా జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల కలకలం..నిధి కోసం వెళ్లితే దిమ్మతిరిగిపోయింది
కృష్ణా జిల్లా ముసునూరు మండలం గుల్లపూడిలో తవ్వకాల కలకలం రేగింది. గుప్త నిధుల కోసం అర్ధరాత్రి తవ్వకాలు చేపట్టారు. దీంతో పురాతన సొరంగం బయటపడింది.

Excavations are in Full Swing : తెలుగు రాష్ట్రాల్లో గుప్తనిధుల తవ్వకాలు పెరిగిపోతున్నాయి. కృష్ణా జిల్లా ముసునూరు మండలం గుల్లపూడిలో తవ్వకాల కలకలం రేగింది. గుప్త నిధుల కోసం అర్ధరాత్రి తవ్వకాలు చేపట్టారు. దీంతో పురాతన సొరంగం బయటపడింది. గుప్త నిధులు ఉన్నాయన్న ప్రచారంతో నిధుల కోసం వేట సాగించారు. అయితే – గ్రామస్తుల ఫిర్యాదుతో పోలీసులు – ఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించారు.
అటు – సొరంగం ప్రాంతాన్ని ఆర్కియాలజీ శాఖ అధికారులు కూడా పరిశీలించారు. బయటపడ్డ సొరంగం చిన్నపిల్లల సమాధిగా గుర్తించారు. అది క్రీస్తుపూర్వం నాటి సమాధిగా తేల్చారు ఆర్కియాలజీ అధికారులు. అప్పటి తెగవాళ్లు చనిపోయిన వాళ్లను ఇలా సమాధిలో పాతిపెట్టేవాళ్లని తెలిపారు. చనిపోయిన వ్యక్తి వస్తువులు కూడా అందులో పెట్టేవాళ్లట. ఈ మొత్తం వ్యవహారంపై మా ప్రతినిధి కార్తీక్ మరింత సమాచారం అందిస్తారు.