ఇలాంటి పరిస్థితి ఏ నాన్నకి వద్దు ..ఆస్తి కోసం కన్న తండ్రి దహన సంస్కారాలను అడ్డుకుని మరీ కొట్టుకున్న కూతుర్లు..

టి సమాజంలో కొడుకులు కంటే కూతుర్లే నయం అంటున్నారు.. అయితే ఆస్థి, డబ్బు ముందు బంధాలు, బంధుత్వాలకు కొడుకు కూతురు బేధం లేదని నిరూపించిందో ఘటన. దారుణంగా ఆస్తి కోసం మరణించిన..తండ్రి అంతిమ కార్యాన్ని కన్న కూతుర్లే..

ఇలాంటి పరిస్థితి ఏ నాన్నకి వద్దు ..ఆస్తి కోసం కన్న తండ్రి దహన సంస్కారాలను అడ్డుకుని మరీ కొట్టుకున్న  కూతుర్లు..
Follow us
Surya Kala

|

Updated on: Feb 17, 2021 | 3:29 PM

Four Daughters Fight For Property: నేటి సమాజంలో కొడుకులు కంటే కూతుర్లే నయం అంటున్నారు.. అయితే ఆస్థి, డబ్బు ముందు బంధాలు, బంధుత్వాలకు కొడుకు కూతురు బేధం లేదని నిరూపించిందో ఘటన. దారుణంగా ఆస్తి కోసం మరణించిన..తండ్రి అంతిమ కార్యాన్ని కన్న కూతుర్లే అడ్డుకున్నారు. దహన సంస్కారాలు…నిర్వహించకుండా శవం ముందే అక్కాచెల్లెళ్ళు ఆస్తి కోసం తగాదా పడ్డారు. ఆస్తి మాకంటే మాకంటూ..గొడవకు దిగారు. ఈ అమానవీయ ఘటన జనగామ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే

జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో దికొండ చంద్రయ్య అనే వృద్ధుడు…కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ..బుధవారం తెల్లవారు జామున మృతిచెందాడు..అయితే, చంద్రయ్యకు భార్య నలుగురు కూతుర్లు ఉండగా, భార్య రత్తమ్మ ఐదేళ్లమే చనిపోయింది. అప్పటి నుంచి ఎవరూ పట్టించుకోక పోవడంతో స్థానికంగా ఉంటున్న మూడో కూతురు కల్లూరి రమ వద్ద ఉంటున్నాడు.

ఈక్రమంలో మూడో కూతురు రమ తండ్రి పేరున ఉన్న ఇంటిని తన పేరుపై రిజిష్ట్రేషన్ చేయించుకుంది. వృద్దాప్యంలో ఉన్న చంద్రయ్య మరణించడంతో మృతదేహాన్ని తన సొంత ఇంటికి తరలించి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా మిగిలిన ముగ్గురు కూతుర్లు అడ్డుపడ్డారు. ఆస్తుల పంపకాలపై అగ్రిమెంట్ చేసుకున్న తర్వాతనే దహన సంస్కారాలు జరపాలని పట్టుబట్టారు.

ఉదయం నుంచి సాయంత్రం వరకు మృతదేహం..ఇంటివద్దనే ఇంటివద్దనే ఉండటంతో విషయం తెలుసుకున్న స్థానిక సర్పంచ్, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరువర్గాలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా వినక పోవడంతో గ్రామపంచాయితీ ఆధ్వర్యంలో అంత్యక్రియలు జరుపుతామని హెచ్చరించడంతో ముందుకు వచ్చి సాయంత్రం దహన సంస్కారాలు నిర్వహించారు.  జరిగినదంతా చూసిన స్థానికులు ఇలాంటి కూతుర్లు కూడా ఉంటారా అని ముక్కున వేలేసుకుంటున్నారు. ఎలాంటి పరిస్థితి ఏ తండ్రికి రావొద్దని కోరుకుంటున్నారు.

Also Read:

జూనియర్ కాలేజీలో మైనర్ బాలికకు వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన బాధితులు..!

 సినీ సెలబ్రిటీలను పిలిచి పోలీస్ ఈవెంట్స్‌ని పబ్లిక్‌లోకి తీసుకొస్తున్న సైబరాబాద్ సీపీ సజ్జనార్

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!