Road traffic safety : సినీ సెలబ్రిటీలను పిలిచి పోలీస్ ఈవెంట్స్‌ని పబ్లిక్‌లోకి తీసుకొస్తున్న సైబరాబాద్ సీపీ సజ్జనార్
వాళ్లకు ఆయనకు సంబంధం లేదు. కాని ఆయన పిలిచారంటే చాలు అలా వాలిపోతారు. ఎందుకుంటే ఆయన ఏదైనా కార్యక్రమం చేపట్టారంటే అందులో సోషల్ మెసేజ్ ఉంటుంది...
వాళ్లకు ఆయనకు సంబంధం లేదు. కాని ఆయన పిలిచారంటే చాలు అలా వాలిపోతారు. ఎందుకుంటే ఆయన ఏదైనా కార్యక్రమం చేపట్టారంటే అందులో సోషల్ మెసేజ్ ఉంటుంది. అందుకే సెలబ్రిటీలు సైతం సోషల్ రెస్పాన్సిబిలిటిగా ఫీలవుతారు. ఆయన ఆహ్వానించడమే ఆలస్యం అటెండెన్స్ వేయించుకుంటారు. మొన్న అనుష్క, నిన్న రామ్‌చరణ్, ఇవాళ ఎన్టీఆర్. ఇలా సినీ సెలబ్రిటీలను పిలిచి పోలీస్ ఈవెంట్స్‌ని పబ్లిక్‌లోకి తీసుకున్నారు సైబరాబాద్ సీపీ సజ్జనార్.
జాతీయ రహదారి భద్రత మాసంలో భాగంగా సైబరాబాద్ పోలీసులు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్‌గా అటెండ్ అయ్యారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టడంతో సైబరాబాద్ పోలీసులు టెక్నాలజీని వాడుకుంటూ ఎందరో ప్రాణాలు కాపాడుతున్నారని సీపీ సజ్జనార్ తెలిపారు. ప్రమాదాల బారిన పడకుండా చూసేందుకు…..ఏదైనా అపదలో చిక్కుకున్న వాళ్లకు ట్రాఫిక్ పోలీసుల సేవలు మరింత చేరువయ్యేలా పెట్రోలింగ్ వాహనాలు నిత్యం అందుబాటులో ఉంచామన్నారు. వార్షికోత్సవ సందర్భంగా నూతన పెట్రోలింగ్ వాహనాల్ని ఎన్టీఆర్ ప్రారంభించారు. రెండు వెహికిల్స్‌ని హైదరాబాద్ -బీజాపూర్ హైవేకి కేటాయించడం జరిగిందన్నారు. ఈకార్యక్రమంలో అడిషనల్ డీజీ రైల్వేస్ సందీప్ శాండిల్య, ట్రాఫిక్ డీసీపీ విజయ్‌కుమార్ పాల్గొన్నారు.
నేరాల సంఖ్యతో పాటు…రోడ్డు ప్రమాదాలు అరికట్టడంలో సైబరాబాద్ పోలీసులు సఫలీకృతం అవుతున్నారని సీపీ సజ్జనార్ తెలిపారు. అలాగే ప్రతి ఒక్కరు బాధ్యతగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ఆ మధ్య సైబరాబాద్ పరిధిలోని పోలీసు బలగాల కోసం నిర్వహించిన మూడో స్పోర్ట్స్ మీట్ ముగింపు కార్యక్రమానికి మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌ని ఆహ్వానించారు సీపీ సజ్జనార్. అక్కడు వచ్చిన రామ్ చరణ్‌ని పొగడ్తలతో ముంచెత్తారు సీపీ. ప్రొఫెషనల్‌గా తీవ్ర ఒత్తిడితో పనిచేసే డిపార్ట్‌మెంట్‌లో ఉంటున్న తమకు సినిమాలు చూసేంత తీరిక ఉండదన్నారు. కాని రామ్‌చరణ్ నటించిన మగధీర, ధృవ, రంగస్థలం తనకు బాగా నచ్చాయన్నారు. సీపీ ఆహ్వానించడంతో డిపార్ట్‌మెంట్ ఈవెంట్‌కి వచ్చిన చెర్రితో సరదాగా గేమ్స్ ఆడారు సజ్జనార్.
Read also : ఛాలెంజింగ్‌గా పోలింగ్, మూడంచెల భద్రతా వ్యవస్థ, 20 కి.మీ పైన ప్రయాణించి కేంద్రాలకు తరలివచ్చిన గిరిజన బాలింతలు