నేడు కేసీఆర్ పుట్టినరోజు : కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచే పేరు

CM KCR Birthday : తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచే పేరు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉరఫ్‌ కేసీఆర్‌. ఆయన సాగించిన తెలంగాణ విమోచన సమరం తెలంగాణ ప్రజల్ని..

నేడు కేసీఆర్ పుట్టినరోజు : కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, తెలంగాణ  చరిత్రలో చిరస్థాయిగా నిలిచే పేరు
Follow us
Venkata Narayana

|

Updated on: Feb 17, 2021 | 11:57 AM

CM KCR Birthday : తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచే పేరు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉరఫ్‌ కేసీఆర్‌. ఆయన సాగించిన తెలంగాణ విమోచన సమరం తెలంగాణ ప్రజల్ని విజయతీరాలకు తీసుకెళ్లి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించింది. తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసి అపరచాణక్యుడిలా ఉద్యమాన్ని నడిపి రాష్ట్ర సాధకుడిగా నిలిచారు కేసీఆర్. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిష్కరణ అనంతరం తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన సీఎం కేసీఆర్, ఆరేండ్ల పాలనలో ఒక మానవతామూర్తిలా తెలంగాణను ముందుకు నడిపిస్తున్నారు.

బక్కపలచని.. సాదా సీదా ఆకు చెప్పులతో తెల్లటి ప్యాంటు షర్టుతో కేవలం 51 కిలోల బరువుతో గాలికి ఎగిరిపోయేలా ఉండే మనిషి తెలంగాణ రాష్ట్రాన్ని సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ముందు వరుసలో నిలబెడుతున్నారు. అటు, తెలంగాణ భాషా వికాసానికి సాంస్కృతిక అభ్యున్నతికి ఎంతో దోహదం కలిగించే పథకాలను సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టారు. ప్రపంచ తెలుగు మహాసభలు, ఐదో తరగతి వరకు తెలుగు తప్పనిసరి భాషగా ఉండాలన్న శాసనం తోపాటు, ప్రభుత్వ ఉత్తర్వులన్నీ తెలుగులో తప్పనిసరిగా ఉండాలని ప్రజల భాషలో పాలనకు పునాది వేశారు కేసీఆర్.

కేవలం తాత్కాలికమైన అవసరాల కోసమే అర్రులు చాచకుండా తెలంగాణలో మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి అద్భుతమైన పథకాలతోపాటు, తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా, పారిశ్రామికంగా ముందు వరుసలో నిలిపేందుకు కేసీఆర్ ఒక ప్రాప్తకాలజ్ఞుడిలా ముందుకు తీసుకెళ్తున్నారు. తెలంగాణ కోటి ఎకరాల మాగాణం కావాలనే లక్ష్యంతో కాళేశ్వరం ప్రాజెక్టుకు పథక రచన చేశారు కేసీఆర్. ఆయన ఆలోచన, ఆచరణ, పట్టుదల, పేదలు, తెలంగాణ పట్ల కేసీఆర్ కున్న ప్రేమ, అవగాహన, ఆరాధనే కేసీఆర్‌ ను ఒక యుగ పురుషుడిలా నిలబెడుతున్నాయి. కేసీఆర్ ఫిబ్రవరి 17వతేదీ 1954లో జన్మించారు. భార్య శోభారాణికాగా, వీరికి ఇద్దరు సంతానం.  కుమారుడు కేటీఆర్, కుమార్తె, కవిత.

Read also : Job News : గెయిల్‌లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగ అవకాశాలు, కెమికల్, ఇన్స్ట్రుమెంటేషన్ విభాగాల్లో నియామకాలు