NIFT: ఎంట్రన్స్ ఎక్సామ్ ఆన్సర్ కీని రిలీజ్ చేసిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ.. ‘కీ’ ని డౌన్ లోడ్ చేసుకోండి ఇలా..
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) ప్రవేశ పరీక్ష ఆన్సర్ కీని రిలీజ్ చేసింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఫిబ్రవరి 17 న...
NIFT: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) ప్రవేశ పరీక్ష ఆన్సర్ కీని రిలీజ్ చేసింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఫిబ్రవరి 17 న (బుధవారం) జనరల్ ఎబిలిటీ టెస్ట్ (జీఏటీ ) కోసం ఆన్సర్ కీని విడుదల చేస్తుంది. జీఏటీ కొశ్చన్ పేపర్ తోపాటు రెస్పాన్స్ షీట్‌తో జీఏటీ ఆన్సర్ కీ విడుదల చేసింది. నిఫ్ట్ ఆన్సర్ కీ 2021 ను యాక్సెస్ చేయడానికి, అభ్యర్థులు వారి రోల్ నంబర్లను ఇన్సర్ట్ చేయాలి, ప్రోగ్రామ్ మరియు నిఫ్ట్ 2021 ఎంట్రన్స్ పరీక్ష బుక్లెట్ నంబర్ ను డ్రాప్-డౌన్ మెను నుండి ఎంచుకొని డేట్ ఆఫ్ బర్త్ ను నమోదు చేయాలి.
డిజైన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన ఆన్సర్ కీతో వారి రెస్పాన్స్ షీట్ ను బట్టి వారు రాసిన ఆన్సర్స్ ను టాలీ చేసుకోవచ్చు. ఆన్సర్ లో ఏదైనా తేడా ఉంటే, అభ్యర్ధులకు ఫిబ్రవరి 17 నుండి ఫిబ్రవరి 20 వరకు పరీక్షా రాసిన వారు అబ్జాషన్ కు అనుమతి ఉంటుంది. ఇందుకోసం 500 రూపాయల ఫీజ్ చెల్లించాలిసి ఉంటుంది. స్టూడెంట్స్ ఆన్ లైన్ ద్వారా తమ అభ్యంతరాలను వ్యక్తం చేయాల్సి ఉంటుంది. అనంతరం నిఫ్ట్ అభ్యంతరాలను తనిఖీ చేస్తుంది. ఆతర్వాత ఫలితాన్ని ఫిబ్రవరి లేదా మార్చి నాటికి విడుదల చేస్తుంది.షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులు ఏప్రిల్ మరియు మే నెలల్లో ఆఫ్‌లైన్ మోడ్‌లో ఒక రౌండ్ ఇంటర్వ్యూ లేదా పరీక్షకు హాజరుకావలసి ఉంటుంది అలాగే తుది నిఫ్ట్ ఫలితాలను మే చివరి నాటికి ప్రకటిస్తారు.
మరిన్ని ఇక్కడ చదవండి :