మాజీ కేంద్ర మంత్రి ఎం.జె.అక్బర్ కేసులో జర్నలిస్ట్ ప్రియా రమణి నిర్దోషి, ఢిల్లీ కోర్టు తీర్పు
జర్నలిస్ట్ ప్రియా రమణిపై మాజీ కేంద్ర మంత్రి ఎం.జె.అక్బర్ దాఖలు చేసిన క్రిమినల్ డిఫమేషన్ కేకు సంబంధించి ఇది నిరూపితం కాలేదని ఢిల్లీ కోర్టు పేర్కొంది.
జర్నలిస్ట్ ప్రియా రమణిపై మాజీ కేంద్ర మంత్రి ఎం.జె.అక్బర్ దాఖలు చేసిన క్రిమినల్ డిఫమేషన్ కేకు సంబంధించి ఇది నిరూపితం కాలేదని ఢిల్లీ కోర్టు పేర్కొంది. అన్ని ఆరోపణల నుంచి ప్రియారమణిని విముక్తం చేస్తూ ఆమెను నిర్దోషిగా ప్రకటించింది. మీ టూ ఉద్యమం బలంగా ఉన్న 2018 నుంచి ఈ కేసు విచారణ కోర్టులో సాగుతోంది. చివరకు బుధవారం దీనిపై సమగ్ర విచారణ జరిపిన కోర్టు..ఆమెకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఎన్ని దశాబ్దాలైనా తన సమస్యను చెప్పుకునే హక్కు మహిళకు ఉందని. మహిళలు తమ ఇబ్బందులను ఏ సమయంలోనైనా , ఏ వేదికపైనైనా ఉంచవచ్ఛు నని భారత రాజ్యాంగం సూచిస్తోందని కోర్టు స్పష్టం చేసింది. బాధితురాళ్ళ పట్ల లైంగిక వేధింపులు చూపే ప్రభావాన్ని సమాజం అర్థం చేసుకోవాలని, సోషల్ స్టేటస్ (సామాజిక హోదా) ఉన్న వ్యక్తి కూడా లైంగిక వేధింపులకు పాల్పడవచ్చునని కోర్టు అభిప్రాయపడింది. సెక్స్యువల్ అబ్యూజ్ అన్నది డిగ్నిటీని, ఆత్మవిశ్వాసాన్ని హరిస్తుందని తెలిపింది.
2018 లో ఒక డైలీకి ఎడిటర్ గా కూడా ఉన్న ఎం.జె. అక్బర్ ఇంటర్వ్యూ తీసుకోవడానికి తాను వెళ్లగా ఆయన తనపట్ల అసభ్యంగా ప్రవర్తించారని జర్నలిస్ట్ ప్రియా రమణి ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను అక్బర్ తిరస్కరించారు. ఇవి నిరాధారమైన ఆరోపణలని, తన ప్రతిష్టకు భంగం కలిగించేందుకే ఆమె ఈ నిందలు వేస్తోందంటూ ఆమెపై పరువు నష్టం దావా వేశారు. నాటి పరిణామాల నేపథ్యంలో ఆయన 2018 అక్టోబర్ 17 న తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. అక్బర్ పై పలువురు మహిళలు కూడా ఆరోపణలు చేసిన విషయం గమనార్హం.
మరిన్ని చదవండి ఇక్కడ :
కెనడాకు పాకిన వ్యవసాయ చట్టాల రద్దు వ్యవహరం.. భారతీయులకు దుండగుల బెదిరింపు కాల్స్
పోర్న్ వీడియోలు చూస్తే పోలీసులకు తెలిసిపోతుంది.. అలర్ట్ మెసేజ్ కూడా వస్తుంది.. సరికొత్త టెక్నాలజీ..