కెనడాకు పాకిన వ్యవసాయ చట్టాల రద్దు వ్యవహరం.. భారతీయులకు దుండగుల బెదిరింపు కాల్స్
కెనడాలో నివసించే భారతీయులకు బెదిరింపు కాల్స్ ఎక్కువయ్యాయి. వారి భద్రత పట్ల ఇక్కడి భారత రాయబార కార్యాలయం ఆందోళన వ్యక్తం చేసింది
threats calls for Indians : కెనడాలో నివసించే భారతీయులకు బెదిరింపు కాల్స్ ఎక్కువయ్యాయి. వారి భద్రత పట్ల ఇక్కడి భారత రాయబార కార్యాలయం ఆందోళన వ్యక్తం చేసింది. వ్యవసాయ చట్టాల రద్దు విషయంలో భారత ప్రభుత్వానికి మద్దతు ప్రకటించటంతో వీరికి పలు బెదిరింపులు ఎదురైనట్టు ఆంగ్ల మీడియా పేర్కొంది. ఇక్కడి భారతీయ విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులకు అత్యాచారం, హింసాత్మక చర్యలకు పాల్పడతామని, వారి వ్యాపారాలను దెబ్బతీస్తామంటూ హెచ్చరిస్తూ ఫోన్ కాల్స్, మెయిల్స్ పంపిస్తున్నారని భారతీయులు ఆందోళన వ్యక్తం చేశారు.
దేశవ్యాప్తంగా ఉన్న భారతీయ సమాజాన్ని ఖలీస్థానీలు తీవ్రంగా బెదిరిస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై తాజాగా నేషనల్ అలయన్స్ ఆఫ్ ఇండో కెనడియన్స్ (ఎన్ఏఐసీ).. కెనడా ప్రజా భద్రతా, అత్యవసర సన్నద్ధత మంత్రి బిల్ బ్లెయిర్‌కు ఓ లేఖ రాసింది. ఖలీస్థానీల బెదిరింపుల నేపథ్యంలో దేశంలోని కెనడియన్ హిందూవులు, మోడరేట్ సిక్కులకు భద్రతా కల్పించాల్సిందిగా లేఖలో ఎన్ఏఐసీ పేర్కొంది. ఇక్కడి భారతీయుల వ్యాపారాలను కూడా దెబ్బతీస్తామని వారు బెదిరించారని ఎన్ఏఐసీ తన లేఖలో వివరించింది.
ముఖ్యంగా గ్రేటర్ టొరంటో, వాంకూవర్, మెట్రో వాంకూవర్, కాల్గరీ వంటి ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రవాస భారతీయుల్లో భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో బెదిరింపులను ఎదుర్కొన్న కెనడా భారతీయులు, ఆ విషయాన్ని స్థానిక పోలీసులకు వెంటనే తెలియచేయాల్సిందిగా కెనడాలో భారతీయ హై కమిషనర్ అజయ్ బసారియా సూచించారు.
ఈ విషయాన్ని ఎన్ఏఐసీ అధ్యక్షుడు డాక్టర్ ఆజాద్ కౌశిక్ ధృవీకరించారు. వెంటనే కెనడా ప్రభుత్వం తమకు భద్రతా కల్పించాలని ఆజాద్ కోరారు. ఈ విషయం తెలుసుకున్న భారత ప్రభుత్వం కెనడాలో భారత సమాజం ఎదుర్కొంటున్న బెదిరింపులపై భారత డయాస్పోరా నాయకులకు, సంఘాల పెద్దలకు లేఖ రాసింది. అటు కెనడాలోని భారత రాయబారి అజయ్ బిసారియా కూడా ఈ నెల 15న కెనడా ప్రభుత్వానికి ఈ విషయమై ఈ మెయిల్ చేశారు.
Read Also…. ఎర్రకోట వద్ద విధ్వంసం ఘటనపై దర్యాప్తు ముమ్మరం.. ఢిల్లీ పోలీసుల అదుపులో కీలక నిందితుడు