ముస్లిం మైనారిటీల పట్ల వేధింపులు, చైనాకు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ వార్నింగ్, సహించబోమని హెచ్ఛ్ రిక

మానవ హక్కుల ఉల్లంఘనలకు పాలపడుతున్న చైనా ఇందుకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ హెచ్చ రించారు.

ముస్లిం మైనారిటీల పట్ల వేధింపులు, చైనాకు  అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ వార్నింగ్,  సహించబోమని హెచ్ఛ్ రిక
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Feb 17, 2021 | 2:56 PM

మానవ హక్కుల ఉల్లంఘనలకు పాలపడుతున్న చైనా ఇందుకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ హెచ్చ రించారు. చైనాలోని జిన్ జియాంగ్ లో ముస్లిం యూగర్స్ పట్ల డ్రాగన్ కంట్రీ పాటిస్తున్న అమానుష చర్యలపై తీవ్రంగా స్పందించిన ఆయన..ఇదే పరిస్థితి కొనసాగితే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని కూడా అన్నారు. ఇప్పటికే చైనాలో మైనారిటీ ముస్లిములపట్ల చైనా అనుసరిస్తున్న తీరుపై అధ్యక్షుడు జీ జిన్ పింగ్ ను ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు తప్పు పడుతున్నాయి. మేము ఎలాంటి చర్యలు తీసుకుంటామో మీకు తెలుసునని, వరల్డ్ లీడర్ గా  మారేందుకు మీరు చేస్తున్న యత్నాలు మాకు ఇదివరకే అవగతమని బైడెన్ వ్యాఖ్యానించారు. ఇతర దేశాల విశ్వాసాన్ని పొందగలమన్న ధీమాతో చైనా అలా ప్రవర్తిస్తోందని బైడెన్ ఓ ఇంటర్వ్యూలో అన్నారు. మానవ హక్కులకు వ్యతిరేకంగా వారు ఏ విధమైన చర్యలకు పాల్పడినా అది వారికే హానికరమవుతుందని ఆయన పేర్కొన్నారు.

ఈ నెలలో జీ జిన్ పింగ్ తో జోబైడెన్ ఫోన్ లో సుమారు 2 గంటలు మాట్లాడారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి భద్రతల పరిస్థితిపై ప్రధానంగా ఉభయులూ చర్చించారు. అయితే అదే సమయంలో హాంకాంగ్, తైవాన్ పై అధిపత్యానికి చైనా చేస్తున్న యత్నాలను బైడెన్ ఖండించారు. ఈ సమస్యలను తాము నిశితంగా గమనిస్తున్నామని, మీ దూకుడును తగ్గించాలని ఆయన సుతిమెత్తగానే హెచ్ఛరించారు.

Read More:

ఉటా విమానాశ్రయంలో 84 అడుగుల ఎత్తయిన స్టీల్ టవర్ క్షణాల్లో నేలమట్టం, వీడియో చూడాల్సిందే

Gust Of Wind: ‘సుడిగాలితో గర్భం దాల్చి శిశువుకు జన్మ నిచ్చిందట’, ఇండోనేసియాలో విచిత్రం ! కట్టుకథేనా ?