AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gust Of Wind: ‘సుడిగాలితో గర్భం దాల్చి శిశువుకు జన్మ నిచ్చిందట’, ఇండోనేసియాలో విచిత్రం ! కట్టుకథేనా ?

ఇండోనేసియాలో పాతికేళ్ల ఓ యువతి తను 'సుడిగాలితో' గర్భం దాల్చానని చెబుతోంది. పైగా గంటలోగా పండంటి ఆడపిల్లకు జన్మ నిచ్చానని అంటోంది. ఇండోనేసియా వెస్ట్ జావా లో..

Gust Of Wind: 'సుడిగాలితో గర్భం దాల్చి శిశువుకు జన్మ నిచ్చిందట', ఇండోనేసియాలో విచిత్రం ! కట్టుకథేనా  ?
Umakanth Rao
| Edited By: Pardhasaradhi Peri|

Updated on: Feb 17, 2021 | 2:07 PM

Share

Gust Of Wind: ఇండోనేసియాలో పాతికేళ్ల ఓ యువతి తను ‘సుడిగాలితో’ గర్భం దాల్చానని చెబుతోంది. పైగా గంటలోగా పండంటి ఆడపిల్లకు జన్మ నిచ్చానని అంటోంది. ఇండోనేసియా వెస్ట్ జావా లోని సియాంజుర్ అనే టౌన్ లో సితి జైనాహ్ అన్న మహిళ ఈ షాకింగ్ న్యూస్ చెప్పింది. బుధవారం తమ ఇంటిలోని లివింగ్ రూమ్ లో తానుండగా ఇంటిని ఒక్కసారిగా సుడిగాలి చుట్టుముట్టిందని,  అనంతరం 15 నిముషాల్లోనే తను గర్భంతో ఉన్నట్టు తెలుసుకున్నానని ఈమె పేర్కొంది. ఆమెను వెంటనే కమ్యూనిటీ ఆసుపత్రికి తీసుకువెళ్లగా అక్కడ ఆడపిల్ల పుట్టింది. ఆ శిశువు 2.9 కేజీల బరువుతో ఆరోగ్యంగా ఉందని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఆశ్చర్యకరమైన ఉదంతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సితిని, ఆమె బిడ్డను చూసేందుకు అధికారులు, జనం క్యూ కట్టారు.

అయితే ‘సుడిగాలి’ అంటూ ఈమె చెబుతున్నదంతా కట్టుకథ అని, కొంతమంది మహిళలకు క్రిప్టిక్ ప్రెగ్నెన్సీ వస్తుందని, అంటే తాము గర్భం దాల్చినట్టు వారికి తెలియనే తెలియదని ఈ హాస్పిటల్ డైరెక్టర్ ఏమాన్ సులేమాన్ అంటున్నారు. ఇక పోలీసులు కూడా దీనిపై ఆరా తీసేందుకు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. గత ఏడాది ఓ యువతికి కూడా ఇలాగే ఓ బేబీ పుట్టింది. సితి జైనాహ్ నాలుగు నెలల క్రితం తన భర్త నుంచి విడిపోయిందని, అప్పటికే వీరికి ఓ బిడ్డ ఉన్నాడని పోలీసులు తెలిపారు.

Read More:

IPL 2020 Auction Highest Paid Players: గతేడాది ఐపీఎల్ వేలంలో అద్భుతం సృష్టించింది వీరే.. అత్యధిక ధరకు..

‘ప్రభుత్వ మితిమీరిన విశ్వాసం’, ఇండియాలో ఎంటరయిన మరో 2 కోవిడ్ స్ట్రెయిన్స్ పై రాహుల్ ఫైర్