IPL 2020 Auction Highest Paid Players: గతేడాది ఐపీఎల్ వేలంలో అద్భుతం సృష్టించింది వీరే.. అత్యధిక ధరకు..
IPL 2020 Auction Highest Paid Players: క్రికెట్‌కు సరికొత్త అర్థం చెబుతూ, ప్రేక్షకులకు మరిచిపోలేని అనుభూతులను పంచుతూ దూసుకొచ్చింది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్). దేశాల మధ్య...
IPL 2020 Auction Highest Paid Players: క్రికెట్‌కు సరికొత్త అర్థం చెబుతూ, ప్రేక్షకులకు మరిచిపోలేని అనుభూతులను పంచుతూ దూసుకొచ్చింది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్). దేశాల మధ్య సరిహద్దులను చెరిపేస్తూ.. అన్ని దేశాల జట్లకు చెందిన ప్లేయర్స్ కలిసి ఆడే ఈ ఆటకు మాములు క్రేజ్ లేదు. ప్రేక్షకులకు వీనుల విందును అందించే ఐపీఎల్ క్రికెటర్లకు, స్పాన్సర్లకు కాసుల వర్షం కురిపిస్తుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐపీఎల్ వేలంలో ఆటగాళ్లను రూ. కోట్లు పెట్టి కొనుగోలు చేయడానికి స్పాన్సర్లు ఆసక్తి చూపిస్తుండడమే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. ఇదిలా ఉంటే తాజాగా 2021 ఐపీఎల్ మినీ వేలం కార్యక్రమం రేపటి నుంచి (ఫిబ్రవరి 18) చెన్నై వేదికగా జరగనుంది. ఈ నేపథ్యంలో గతేడాది ఐపీఎల్ వేలంలో ఏ పేర్లు ఎక్కువ ధరకు అమ్ముడు పోయారు, ఎలాంటి రికార్డులు నమోదయ్యాయి లాంటి వివరాలు మీకోసం.. 2020 ఐపీఎల్ వేలం పాటలో.. పలు సంచనాలు నమోదయ్యాయి. కోల్‌కతా వేదికగా జరిగిన వేలంపాట రికార్డులు తిరగరాసింది. ఈ వేలం పాటలో అత్యధికంగా ఆస్ట్రేలియన్ ప్లేయర్ పాట్ కమిన్స్ ఏకంగా రూ. 15.5 కోట్లకు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు సొంతం చేసుకుంది. ఐపీఎల్‌లో ఓ వీదేశీ ప్లేయర్‌కు ఈ ధర పలకడం ఇదే తొలిసారి కావడం విశేషం. అనంతరం ఆస్ట్రేలియా ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రూ.10.75 కోట్లకు కొనుగోలు చేసింది. క్రిస్ మెరిస్‌ను (దక్షిణాఫ్రికా) రూ. 10 కోట్లకు బెంగళూరు రాయల్ ఛాలెంజ్ కొనుగోలు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ ఇండియన్ ప్లేయర్ పియూష్ చావ్లాను రూ.6.75 కోట్లకు సొంతం చేసుకుంది. వెస్టిండీస్ ఆటగాడు హెట్ మెయిర్ రూ.7.75 కోట్లకు ఢిల్లీ కేపిటల్స్ సొంతం చేసుకుంది. ఇంగ్లండ్ ప్లేయిర్ ఇయాన్ మోర్గాన్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైస్ రూ.5.25 కోట్లకు అమ్ముడుపోయాడు. ఆస్ట్రేలియాకు చెందిన ఆరోన్ ఫించ్‌ను రాయల్ ఛాలెంజర్స్ రూ.4.40 కోట్లకు సొంతం చేసుకుంది. భారత్‌కు చెందిన ఆటగాడు వరుణ్ చక్రవర్తిని కోల్‌కతా నైట్ రైడర్స్ రూ.4 కోట్లకు కొనుగోలు చేసింది. రాబిన్ ఊతప్పను రాజస్థాన్ రాయల్స్ రూ.3 కోట్లకు దక్కించుకుంది. ఇండియన్ ప్లేయర్ జైస్వాల్‌ను రాజస్థాన్ రాయల్స్ రూ.2.40 కోట్లకు సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియన్ ప్లేయర్ క్రిస్‌లిన్‌ను ముంబై ఇండియన్స్ రూ. 2 కోట్లకు సొంతం చేసుకుంది. ఇక భారత యువ క్రికెటర్ జైస్వాల్‌ను రాజస్థాన్ రాయల్స్ రూ.2.40 కోట్లకు కొనుగోలు చేసింది. అలాగే.. ప్రియమ్ గార్గ్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.1.9 కోట్లకు దక్కించుకుంది. Also Read: AP Panchayat Elections 2021 live: ఏపీలో కొనసాగుతోన్న పంచాయతీ ఎన్నికలు.. వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారంటూ టీడీపీ నేతల ఆందోళన
IPL 2021 Auction: ఐపీఎల్ 2021కు రంగం సిద్దం.. కేదార్ జాదవ్, పియూష్ చావ్లా, ఫించ్‌లకు నిరాశేనా.!!