ఉటా విమానాశ్రయంలో 84 అడుగుల ఎత్తయిన స్టీల్ టవర్ క్షణాల్లో నేలమట్టం, వీడియో చూడాల్సిందే
అమెరికాలోని ఉటాలోగల సాల్ట్ లేక్ సిటీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో 84 అడుగుల ఎత్తయిన స్టీల్, కాంక్రీట్ టవర్ క్షణాల్లో నేలమట్టమైంది. కేవలం కొద్ది సెకండ్లలో..
అమెరికాలోని ఉటాలోగల సాల్ట్ లేక్ సిటీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో 84 అడుగుల ఎత్తయిన స్టీల్, కాంక్రీట్ టవర్ క్షణాల్లో నేలమట్టమైంది. కేవలం కొద్ది సెకండ్లలో ఇది కూలిన దృశ్యం తాలూకు వీడియోను ఎయిర్ పోర్టు అధికారులు రిలీజ్ చేశారు. ఈ విమానాశ్రయ రీడెవలప్ మెంట్ ప్రాజెక్టులో భాగంగా ఈ బ్రహ్మాండమైన టవర్ కు ఇలా ‘టాటా’చెప్పినట్టు ఈ ప్రాజెక్టు డైరెక్టర్ మైక్ విలియమ్స్ తెలిపారు. 1989 లో దీన్ని నిర్మించారని, ఎయిర్ పోర్టు ఆధునీకరణలోభాగంగా ఈ ప్రక్రియ చేపట్టామని ఆయన చెప్పారు. 1989-1990 మధ్య కాలంలో విమానాల దిశను తెలిపేందుకు ఈ డెల్టా టవర్ ని నిర్మించారు. విమానాశ్రయ పునరభివృద్ధి కార్యక్రమంలో ఇదో మైలురాయి అని విలియమ్స్ పేర్కొన్నారు. దీనివల్ల ఎంతో సమయం ఆదా అయిందన్నారు. ప్రాజెక్టు రెండో దశలో ఈ విధమైన మరిన్ని కార్యక్రమాలు చేపడుతామని ఆయన చెప్పారు.
Today, this 84-foot Delta Tower that was built in 1989 to direct aircraft to the gate was demolished. Here is some footage Avalanche Studios took from the Delta Sky Club. The demolition marks a major timeline in the construction of Phase II of #TheNewSLC. pic.twitter.com/Bc2hQW7udm
— SaltLakeCityAirport (@slcairport) February 15, 2021
ఇప్పటికే ఉటాలో కాలం చెల్లిన కట్టడాలను, భవనాలను అధునాతన పధ్ధతుల్లో కొద్ది సెకండల్లో నేలమట్టం చేస్తున్నారు. ఇందుకు పెద్ద ఖర్చు కూడా కాదని అధికారులు చెబుతున్నారు.