Elakkiyaa: ఎలక్కియా ఎందుకిలా..? నిజంగానే సూసైడ్ అటెంప్ట్ చేశావా..?
చెన్నైకి చెందిన ఫేమస్ యూట్యూబర్ ఎలక్కియా ఆత్మహత్యాయత్నం చేసిందన్న వార్త కలకలం రేపుతోంది. వ్యక్తిగత జీవితంలో ఎదురైన మోసాలే కారణమా? లేక పబ్లిసిటీ స్టంట్‌గా చేశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. తాజాగా ఆమె ఇన్ స్టాలో పెట్టిన స్టోరీ కొత్త అనుమానాలకు తావిస్తోంది.

ఎప్పుడూ ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండే చెన్నై యూట్యూబర్ ఎలక్కియా సూసైడ్ అటెంప్ట్ కలకలం రేపింది. కారణమేంటన్నది మాత్రం తెలియరాలేదు. ప్రస్తుతం ఆమె నిద్రమత్తులో ఉంది. స్పృహ వస్తేనే అసలు నిజం బయటకు వచ్చే అవకాశం ఉంది.
కుర్రకారు గుండెల్లి కొల్లగొట్టిన ఎలక్కియా
టిక్ టాక్ వీడియోలతో ఫేమస్ అయ్యింది ఎలక్కియా. ఎక్స్‌పోజింగ్ వీడియోలతో కుర్రకారు గుండెల్ని కొల్లగొట్టింది. వీడియో పోస్ట్ చేసిందంటే చాలూ.. లక్షలకొద్ది వ్యూస్, లైక్‌లు వచ్చిపడుతుంటాయి. అంత క్రేజ్ ఉంది ఈమె వీడియోలకి. తెరవెనుక ఏం జరిగిందో తెలియదు.. ఆల్ ఆఫ్ సడెన్‌గా నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది.
తమిళనాట కొన్ని సినిమాల్లో నటించింది ఎలక్కియా. గతంలో కొంతమంది దర్శకులపై తీవ్ర ఆరోపణలు చేసింది. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామంటూనే.. లైంగికంగా తమకు సపోర్ట్ చేయాలని కోరారని బాంబు పేల్చింది. వాళ్లను నమ్మి చాలా మోసపోయానని ఆవేదన వ్యక్తం చేసింది. అప్పట్లో ఈమె చేసిన కామెంట్స్ కోలీవుడ్‌ని షేక్ చేసింది.
అడపాదడపా సినిమాల్లో తళుక్కుమంటూనే.. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌తో తెగ ఫేమస్ అయ్యింది ఎలక్కియా. ఈమె వీడియోలకి ఏ స్థాయిలో రెస్పాన్స్ ఉందో.. అదే స్థాయిలో విమర్శలొస్తుంటాయి. అందాల ఆరబోత అంత అక్కర్లేదంటూ కొంతమంది నెటిజన్లు ఫైర్ అవుతుంటే.. ఇంకొందరు మాత్రం సినిమాల్లో గట్టిగా ట్రై చేయమని సలహా ఇస్తుంటారు. కామెంట్లు ఎలాంటివైనా లెక్కలోకి తీసుకోకుండా.. తనదైన స్టయిల్‌లో వీడియోలతో హీట్ పుట్టిస్తోంది ఎలక్కియా.
“స్టంట్ మాస్టర్ దిలీప్ సుబ్బరాయన్ నా మరణానికి కారణం. అతను నన్ను నమ్మించి.. మోసం చేశాడు. అతనికి చాలా మంది మహిళలతో సంబంధం పెట్టుకున్నాడు. నేను గత 6 సంవత్సరాలుగా అతనితో ఉన్నాను. అతను కొడుతున్న దెబ్బలు ఇకపై భరించలేను.’ అంటూ ఆమె ఇన్ స్టాలో స్టోరీ పెట్టాడు. అందులో దిలీప్ సుబ్బరాయన్ ఫోటోను కూడా షేర్ చేసింది. అయితే తాజా ట్విస్ట్ ఏంటంటే..? ఇదంతా ఫేక్ న్యూస్ అని ఆమె అధికారిక ఇన్ స్టా ఖాతా నుంచి మరో స్టోరుీ పెట్టడం గమనార్హం. నిజంగా ఇదంతా పబ్లిసిటీ స్టంటా..? లేదంటే ఏదైనా మత్తులో చేసిన వ్యవహారమే.. అనేది పోలీసులే తేల్చాలి.
View this post on Instagram




