ED Notice: సోదాలు జరిపిన ఈడీ అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు.. అసలు కారణం ఇదే..
బెంగాల్‌లో ఈడీ అధికారులపై దాడి వ్యవహారం కొత్తమలుపు తిరిగింది. ఈడీ అధికారులపై బెంగాల్ అధికారులు మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడం సంచలనం రేపింది. బెంగాల్‌లో ఈడీ వర్సెస్ తృణమూల్ వ్యవహారం మరింత ముదిరింది. ఈడీ అధికారులపై నార్త్ 24 పరగణ జిల్లా సందేశ్‌కాలీ పోలీసుస్టేషన్‌లో మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కావడం సంచలనం రేపింది. అక్రమంగా చొరబడి , మహిళపై దాడి చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలపై కేసులు నమోదయ్యాయి.

బెంగాల్‌లో ఈడీ అధికారులపై దాడి వ్యవహారం కొత్తమలుపు తిరిగింది. ఈడీ అధికారులపై బెంగాల్ అధికారులు మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడం సంచలనం రేపింది. బెంగాల్‌లో ఈడీ వర్సెస్ తృణమూల్ వ్యవహారం మరింత ముదిరింది. ఈడీ అధికారులపై నార్త్ 24 పరగణ జిల్లా సందేశ్‌కాలీ పోలీసుస్టేషన్‌లో మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కావడం సంచలనం రేపింది. అక్రమంగా చొరబడి , మహిళపై దాడి చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలపై కేసులు నమోదయ్యాయి. టీఎంసీ నేత షాజహాన్ నివాసంలో శుక్రవారం సోదాలు చేయడానికి వెళ్లిన సమయంలో ఈడీ అధికారులపై స్ధానికులు దాడి చేయడం సంచలనం రేపింది. దాడి చేసిన వారిలో మహిళలు కూడా ఉన్నారు.
షాజహాన్ కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో ఓ కేసు ఈడీ అధికారులపై నమోదయ్యింది. ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండానే ఈడీ అధికారులు తమ ఇంట్లోకి చొరబడ్డారని ఆరోపించారు. ఈడీ అధికారులపై దాడి కేసులో ఇప్పటివరకు పోలీసులు కేసు నమోదు చేయలేదు. ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. స్థానికుల దాడిలో ముగ్గురు ఈడీ అధికారులకు తీవ్రగాయాలయ్యాయి. సోదాలు చేయడానికి వెళ్లిన సమయంలో షాజహాన్ షేక్ ఇంట్లోనే ఉన్నాడని ఈడీ అధికారులు చెబుతున్నారు. ఫోన్ లొకేషన్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసిందని చెబుతున్నారు. సీఆర్‌పీఎఫ్ సెక్యూరిటీతో వెళ్లినప్పటికి ఈడీ అధికారులపై దాడి జరగడం సంచలనం రేపింది. ఈడీ అధికారులపై దాడి చేసిన షాజహాన్ షేక్ అనుచరులు వాళ్ల మొబైల్ ఫోన్లు , ల్యాప్‌టాప్, పర్సులను ఎత్తుకెళ్లినట్టు ఆరోపణలు వచ్చాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..