AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: కక్కుర్తి పాడుగాను…వేలాది పూలకుండీలను ఎత్తుకెళ్లిన జనం… ప్రధాని మోదీ ప్రారంభించిన మరునాడే మాయం

లక్నోలో ప్రధాని మోదీ నిన్న ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రాష్ట్రీయ ప్రేరణా స్థల్‌ నుంచి వేలాది పూలకుండీలను స్థానికులు ఎత్తుకెళ్లడం తీవ్ర కలకలం రేపింది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించిన మరుసటి రోజు నుంచే పూల కుండీలను ఎత్తుకెళ్లడంపై స్థానికులు మండిపడుతున్నారు. పోలీసు సెక్యూరిటీ ఏర్పాటు...

Viral Video: కక్కుర్తి పాడుగాను...వేలాది పూలకుండీలను ఎత్తుకెళ్లిన జనం... ప్రధాని మోదీ ప్రారంభించిన మరునాడే మాయం
Flower Pots Steal
K Sammaiah
|

Updated on: Jan 02, 2026 | 4:12 PM

Share

లక్నోలో ప్రధాని మోదీ నిన్న ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రాష్ట్రీయ ప్రేరణా స్థల్‌ నుంచి వేలాది పూలకుండీలను స్థానికులు ఎత్తుకెళ్లడం తీవ్ర కలకలం రేపింది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించిన మరుసటి రోజు నుంచే పూల కుండీలను ఎత్తుకెళ్లడంపై స్థానికులు మండిపడుతున్నారు. పోలీసు సెక్యూరిటీ ఏర్పాటు చేసినప్పటికి పూలకుండీలను ఎత్తుకెళ్లడం సంచలనం సృష్టించింది.

ఇప్పటివరకు నాలుగు వేల పూలకుండీలను ఎత్తుకెళ్లినట్టు అధికారులు గుర్తించారు. పిల్లలు సైకిళ్ల మీద , పెద్దలు ఆటోల్లో , టూవీలర్స్‌పై వచ్చి పూలకుండీలను ఎత్తుకెళ్లారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

వాజ్‌పేయి 101 జయంతి సందర్భంగా లక్నోలో రాష్ట్రీయ ప్రేరణా స్థల్‌ను ఆవిష్కరించారు ప్రధాని మోదీ. ఈ కార్యక్రమానికి యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ హాజరయ్యారు. ప్రేరణా స్థల్‌లో 65 అడుగుల వాజ్‌పేయి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. భారతమాత విగ్రహానికి నివాళి అర్పించారు. రూ.230 కోట్లతో రాష్ట్రీయ ప్రేరణా స్థల్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ప్రేరణా స్థల్‌లో జరిగిన సభకు లక్షలాదిమంది హాజరయ్యారు.

సభకు యూపీ సర్కార్‌ గ్రాండ్‌గా ఏర్పాట్లు చేసింది. నగరం మొత్తం రంగురంగుల పూలతో అలంకరించింది. సభా ప్రాంగణం వద్ద వేల కొద్దీ పూల కుండీలతో డెకరేట్‌ చేసింది యోగీ ప్రభుత్వం. అయితే సభ అనంతరం ఇలా పూలకుండీలను స్థానికులు ఎత్తుకెళ్లారు. వీడియోలు వైరల్‌ కావడంతో నెటిజన్స్‌ రకరకాలుగా కామెంట్స్‌ పెడుతున్నారు.

వీడియో చూడండి:

Follow Us
బంగారమా.. భూమా? భారతీయులు దేని మీద పెట్టుబడి పెడుతున్నారంటే?
బంగారమా.. భూమా? భారతీయులు దేని మీద పెట్టుబడి పెడుతున్నారంటే?
Numerology: మీ జీవితంలో టర్నింగ్ పాయింట్ ఏ వయస్సులో వస్తుంది..?
Numerology: మీ జీవితంలో టర్నింగ్ పాయింట్ ఏ వయస్సులో వస్తుంది..?
పడుకునే ముందు 2 వెల్లుల్లి రెబ్బలు.. శరీరంలో జరిగే మార్పులు ఇవే!
పడుకునే ముందు 2 వెల్లుల్లి రెబ్బలు.. శరీరంలో జరిగే మార్పులు ఇవే!
యశ్ 'టాక్సిక్' సినిమాను వదులుకున్న స్టార్ హీరో ఆయనేనా?
యశ్ 'టాక్సిక్' సినిమాను వదులుకున్న స్టార్ హీరో ఆయనేనా?
బాబా వంగా జ్యోస్యం.. త్వరలో కోరికలు నెరవేర్చుకునే రాశులివే!
బాబా వంగా జ్యోస్యం.. త్వరలో కోరికలు నెరవేర్చుకునే రాశులివే!
తలకు గోరింటాకు వాడుతున్నారా?ప్యూర్ హెన్నా వర్సెస్ బ్లాక్ హెన్నా
తలకు గోరింటాకు వాడుతున్నారా?ప్యూర్ హెన్నా వర్సెస్ బ్లాక్ హెన్నా
ఫిక్స్‌డ్ డిపాజిట్ సొమ్ము ముందే విత్ డ్రా చేసుకుంటే నష్టమేనా..?
ఫిక్స్‌డ్ డిపాజిట్ సొమ్ము ముందే విత్ డ్రా చేసుకుంటే నష్టమేనా..?
పెళ్లైన మొదటి సంవత్సరం.. మహిళలు అస్సలే చేయకూడని ఐదు తప్పులివే!
పెళ్లైన మొదటి సంవత్సరం.. మహిళలు అస్సలే చేయకూడని ఐదు తప్పులివే!
రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఈ ట్రైన్ టైమింగ్స్‌లో నో ఛేంజ్!
రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఈ ట్రైన్ టైమింగ్స్‌లో నో ఛేంజ్!
18 ఏళ్లలో 10,000 పాములు పట్టిన స్నేక్‌మ్యాన్‌ అరుదైన రికార్డు..!
18 ఏళ్లలో 10,000 పాములు పట్టిన స్నేక్‌మ్యాన్‌ అరుదైన రికార్డు..!