AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేవుని కోడెకు దివ్య వీడ్కోలు… ఊరంతా కన్నీటి నివాళి.. ఆ దృశ్యం చూడాల్సిందే!

ఒక మూగజీవి.. కానీ, ఊరికి మాత్రం ప్రతి ఒక్కరికి కుటుంబ సభ్యుడే. వేలాది హృదయాలతో అనుబంధం కలిగి ఉంది. అది సాధారణ కోడె కాదు... గ్రామస్థుల విశ్వాసంలో దేవుని కోడె... ఆంబోతు. తమతో ఎంతగానో మమేకమైన ఆంబోతు చనిపోవడాన్ని గ్రామస్థులు జీర్ణించుకోలేకపోయారు. మనుషులకు చేసే విధంగానే అంతిమయాత్ర నిర్వహించారు. బాజా భజంత్రీలు, డీజే, కోలాటాలు, హారతులు... పూలమాలలతో ఘనంగా సాగనంపారు. హిందూ సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించి గ్రామస్తులు తమ భక్తిని చాటుకున్నారు. ఈ అరుదైన ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

దేవుని కోడెకు దివ్య వీడ్కోలు... ఊరంతా కన్నీటి నివాళి.. ఆ దృశ్యం చూడాల్సిందే!
Emple Bull Funeral
M Revan Reddy
| Edited By: |

Updated on: Aug 06, 2026 | 12:57 PM

Share

నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపహాడ్ గ్రామంలో కొన్నేళ్ల క్రితం సంప్రదాయ పద్ధతిలో ఓ కుటుంబం కోడే దూడను ఆంబోతుగా వదిలిపెట్టారు. ఏళ్లుగా స్వేచ్ఛగా తిరుగుతూ అందరి ప్రేమాభిమానాలు పొందిన ఆంబోతు అనారోగ్యంతో మృతి చెందింది. గ్రామ దేవతకు ప్రతీకగా భావించే ఈ దేవుని కోడె మరణంతో గ్రామమంతా విషాదంలో మునిగిపోయింది. విషయం తెలిసిన వెంటనే చిన్నా, పెద్దా తేడా లేకుండా గ్రామస్తులంతా అక్కడికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు.

తమ ఇంట్లో వాళ్లు పోయినంత ఆవేదనకు గురయ్యారు. మృతిచెందిన ఆంబోతును పూలతో అలంకరించి ప్రత్యేక వాహనంపై గ్రామ వీధుల్లో ఊరేగించారు. ముందు బాజా భజంత్రీలు, డప్పులు, డీజే సౌండ్లు… మధ్యలో కోలాటాలు… భక్తి గీతాలతో గ్రామమంతా మార్మోగింది. మహిళలు హారతులు పట్టారు. ఊరంతా కలిసి హిందూ సాంప్రదాయ బద్దంగా ఖననం చేసి ఘనంగా విడ్కోలు పలికారు. గ్రామస్థులు దేవుని కోడెకు ఇదే మా కృతజ్ఞత అంటూ నివాళులర్పించారు. మూగజీవుల పట్ల తమకున్న ఆరాధన, సంస్కృతి, సంప్రదాయాలను మరోసారి చాటిచెప్పారు.

వీడియో ఇక్కడ చూడండి..

ఆంబోతు అంత్యక్రియలు చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన వారికి భోజనాలు పెట్టారు. దాదాపు ఓ గ్రామస్థాయి నాయకుడు మరణిస్తే ఎంత మర్యాద, గౌరవంగా సాగనంపుతారో అంతే చేశారు.

ఇవి కూడా చదవండి

నేటి కాలంలో మనుషులకే అంతిమ యాత్రకు నలుగురు దొరకడం కష్టమవుతున్న వేళ… ఒక మూగజీవిని దేవుని ప్రతిరూపంగా భావించి ఊరంతా కలిసి కన్నీటి వీడ్కోలు పలకడం… కొర్లపహాడ్ గ్రామ సంస్కృతికి, విశ్వాసానికి అద్దం పట్టింది. దేవుని కోడె వెళ్లిపోయింది.ఇది గ్రామీణ ప్రాంతంలో రైతు కుటుంబాలకు, పశువులకు ఉండే అనుబంధానికి ప్రతీకగా నిలిచింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఇది తింటే చాలు.. తిన్నదంతా ఇట్టే అరిగిపోతుంది.. గ్యాస్ కూడా రాదు
ఇది తింటే చాలు.. తిన్నదంతా ఇట్టే అరిగిపోతుంది.. గ్యాస్ కూడా రాదు
జైస్వాల్‌నే కాదు వైభవ్‌ని కూడా శిక్షించాల్సిందే..
జైస్వాల్‌నే కాదు వైభవ్‌ని కూడా శిక్షించాల్సిందే..
షాకిచ్చిన ట్రంప్..వీసా అపాయింట్‌మెంట్లు నిలిపివేత!
షాకిచ్చిన ట్రంప్..వీసా అపాయింట్‌మెంట్లు నిలిపివేత!
పరమ చెత్త సినిమా.. 45 కోట్లు పెడితే పబ్లిసిటీ డబ్బులు రాలేదు..
పరమ చెత్త సినిమా.. 45 కోట్లు పెడితే పబ్లిసిటీ డబ్బులు రాలేదు..
చేప ముల్లు గొంతులో ఇరుక్కుంటే వెంటనే ఇలా చేయండి.. దెబ్బకు రిలీఫ్
చేప ముల్లు గొంతులో ఇరుక్కుంటే వెంటనే ఇలా చేయండి.. దెబ్బకు రిలీఫ్
24 ఏళ్ల గిన్నిస్‌ రికార్డ్‌ను బ్రేక్‌ చేసిన విచిత్ర పిల్లి! ఆకారం
24 ఏళ్ల గిన్నిస్‌ రికార్డ్‌ను బ్రేక్‌ చేసిన విచిత్ర పిల్లి! ఆకారం
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం
కడుపుతో ఉన్నప్పుడు వర్కవుట్స్ చేయొచ్చా.. సమంత ఏం చెప్పిందంటే..
కడుపుతో ఉన్నప్పుడు వర్కవుట్స్ చేయొచ్చా.. సమంత ఏం చెప్పిందంటే..
చిన్నప్పుడు రామ్ చరణ్‌ను స్కూల్ నుంచి నేనే తీసుకొచ్చేవాడిని..
చిన్నప్పుడు రామ్ చరణ్‌ను స్కూల్ నుంచి నేనే తీసుకొచ్చేవాడిని..
భారతదేశంలో వెల్‌నెస్ టూరిజానికి రిషికేశ్‌ కొత్త చిరునామా..
భారతదేశంలో వెల్‌నెస్ టూరిజానికి రిషికేశ్‌ కొత్త చిరునామా..