PM Modi: బీజేపీ లోక్ సభ ఎన్నికల ప్రచారం అప్పటి నుంచే.. ఈ ప్రాంతంలో తొలి సభకు శ్రీకారం..
దేశంలోని అన్ని పార్టీల చూపు లోక్ సభ ఎన్నికల మీదే ఉంది. ఎలాగైనా మూడో సారి అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ తన రాజకీయ వ్యూహాలకు పదును పెడుతోంది. ఇక కాంగ్రెస్ కూడా అన్ని ప్రాంతీయ పార్టీలతో మద్దతు కూడగట్టే ప్రయత్నంలో ఉంది. ఇదిలా ఉంటే కేంద్ర ఎన్నికల సంఘం లోక్ సభ ఎన్నికల నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేస్తోంది. ఇవన్నీ ఒకెత్తైతే.. రాజకీయ పార్టీలు తమ ప్రచార అస్త్రాలను ఇప్పటి నుంచే సిద్దం చేసుకుంటున్నాయి.
దేశంలోని అన్ని పార్టీల చూపు లోక్ సభ ఎన్నికల మీదే ఉంది. ఎలాగైనా మూడో సారి అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ తన రాజకీయ వ్యూహాలకు పదును పెడుతోంది. ఇక కాంగ్రెస్ కూడా అన్ని ప్రాంతీయ పార్టీలతో మద్దతు కూడగట్టే ప్రయత్నంలో ఉంది. ఇదిలా ఉంటే కేంద్ర ఎన్నికల సంఘం లోక్ సభ ఎన్నికల నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేస్తోంది. ఇవన్నీ ఒకెత్తైతే.. రాజకీయ పార్టీలు తమ ప్రచార అస్త్రాలను ఇప్పటి నుంచే సిద్దం చేసుకుంటున్నాయి. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరుతో మరోసారి పాదయాత్ర చేయబోతున్నారు. దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ కూడా సిద్దమైంది.
ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ కూడా తన లోక్ సభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. జనవరి 13 నుంచి మోదీ ఎన్నికల ప్రచారాన్ని పారంభించనున్నట్లు అధికారికంగా తెలుస్తోంది. తొలి సభ బిహార్ నుంచే ప్రారంభం కానున్నట్లు బీజేపీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో 40 స్థానాలు ఉన్న బిహార్ ను తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. రాష్ట్రంలోని బేగూసరాయ్, బెతియా, ఔరంగాబాద్‌లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి.
బిహార్ లో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలు వివిధ ప్రచార సభల్లో పాల్గొననున్నట్లు సమాచారం. జనవరి 15 తర్వాత ముమ్మర ప్రచారం ఉంటుందని సమాచారం. సీతామఢి, మధేపురా, నలందాల్లో అమిత్‌షా పాల్గొననుండగా సీమాంచల్‌లో జేపీ నడ్డా పర్యటించనున్నారు. బీజేపీకి ధీటుగా విపక్ష కూటమి ఇండియాలో కీలక భూమిక పోషిస్తున్న ప్రస్తుత బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా రాజకీయ వ్యూహాలను రచిస్తున్నారు. ఇప్పటికే ప్రధాన మంత్రి రేసులో ఉన్న ఈయన గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..