ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు.. సమాయిషీ ఇచ్చుకున్న మాల్దీవుల సర్కార్
మాల్దీవుల మహమ్మద్ ముయిజూ ప్రభుత్వ మంత్రి మరియం షియునా భారత్ దేశంతో పాటు, ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా వివాదాస్పద ప్రకటన చేశారు. ఈ విషయంలో మాల్దీవుల ప్రభుత్వం కఠినమైన వైఖరిని అవలంబించకపోవడం పట్ల భారత ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రపంచవ్యాప్తంగా దుమారం చెలరేగడంతో మాల్దీవుల సర్కార్ తాజాగా దిగి వచ్చింది. సదరు మంత్రిపై చర్యలకు సిద్ధమైంది.
మాల్దీవుల మహమ్మద్ ముయిజూ ప్రభుత్వ మంత్రి మరియం షియునా భారత్ దేశంతో పాటు, ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా వివాదాస్పద ప్రకటన చేశారు. ఈ విషయంలో మాల్దీవుల ప్రభుత్వం కఠినమైన వైఖరిని అవలంబించకపోవడం పట్ల భారత ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రపంచవ్యాప్తంగా దుమారం చెలరేగడంతో మాల్దీవుల సర్కార్ తాజాగా దిగి వచ్చింది. సదరు మంత్రిపై చర్యలకు సిద్ధమైంది.
మాల్దీవుల ప్రభుత్వం తన మంత్రి వివాదాస్పద ప్రకటనతో సంబంధం లేదని ప్రకటించింది. కించపరిచే వ్యాఖ్యలు చేసే వారిపై చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని మాల్దీవుల ప్రభుత్వం స్పష్టం చేసింది. మాల్దీవుల అధికార పార్టీ ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్ (పిపిఎం) నాయకుడు జాహిద్ రమీజ్ మేరకు సోషల్ మీడియా వేదిక ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడం ద్వారా భారతదేశంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. డబ్బు సంపాదించడానికి భారతదేశం శ్రీలంక వంటి చిన్న ఆర్థిక వ్యవస్థను కాపీ కొడుతోంది అంటూ ఆరోపించారు.
మంత్రుల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహమ్మద్ నషీద్, మంత్రుల వ్యాఖ్యలు ప్రభుత్వ విధానాన్ని ప్రతిబింబించవంటూ ప్రపంచానికి తెలియజేయాలని ప్రస్తుత అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జును కోరారు. “మాల్దీవుల భద్రత, శ్రేయస్సు కోసం కీలకమైన మిత్రదేశ నాయకుడి పట్ల మాల్దీవుల ప్రభుత్వ అధికారి మరియమ్ షియునా ఎంత భయంకరమైన భాష మాట్లాడారు. మొహమ్మద్ ముయిజ్జూ ప్రభుత్వం ఈ వ్యాఖ్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు నషీద్.
దీంతో మాల్దీవుల ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. “ప్రజాస్వామ్యంలో బాధ్యతాయుతమైన రీతిలో భావప్రకటనా స్వేచ్ఛను ఉపయోగించాలని ప్రభుత్వం విశ్వసిస్తుంది. ఇది ద్వేషం, ప్రతికూలతను వ్యాప్తి చేయని విధంగా చేయాలి.” మాల్దీవులు అంతర్జాతీయ భాగస్వాముల మధ్య సంబంధాలను ప్రభావితం చేసే విధంగా భావ ప్రకటనా స్వేచ్ఛను ఉపయోగించరాదని ఆయన అన్నారు. ఇది ఆ మంత్రి వ్యక్తిగత ప్రకటన అని, ప్రభుత్వానికి దీనితో సంబంధం లేదని మాల్దీవుల ప్రభుత్వం తరపున సంజాయిషీ ఇచ్చుకున్నారు.
ప్రధాని మోదీ ఇటీవల లక్షద్వీప్‌లో పర్యటించారు. అతను అక్కడ నుండి చాలా ఫోటోలను ట్విట్టర్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఆ తర్వాత మాల్దీవుల ప్రభుత్వ మంత్రి మరియం షియునా ప్రధాని మోదీని ఎగతాళి చేశారు. దీని తరువాత, భారతదేశ ప్రజలు #BoycottMaldives ప్రచారాన్ని ప్రారంభించారు. PM నరేంద్ర మోడీ లక్షద్వీప్ చిత్రాలను పంచుకున్న రోజున, మాల్దీవులు Xలో ట్రెండింగ్ చేయడం ప్రారంభించాయి. మచాలా మంది మాల్దీవులకు బదులుగా లక్షద్వీప్‌ను సందర్శించడం గురించి చర్చ మొదలైంది.
ఇదిలావుంటే ప్రెసిడెంట్ మహమ్మద్ ముయిజు అధికారంలోకి వచ్చిన తర్వాత గత కొన్ని నెలలుగా భారత్-మాల్దీవుల సంబంధాలు దెబ్బతిన్నాయి. చైనా అనుకూల రాజకీయ నాయకుడిగా కనిపించే మిస్టర్ ముయిజ్జూ, సెప్టెంబరులో జరిగిన ప్రెసిడెన్షియల్ రన్-ఆఫ్‌లో భారతదేశానికి అనుకూలమైన తన పూర్వీకుడు ఇబ్రహీం మొహమ్మద్ సోలిహ్‌ను ఓడించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…