AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

5ఏళ్ల బాలికకు అరుదైన వ్యాధి.. స్పృహలో ఉండగానే బ్రెయిన్‌ సర్జరీ.. ప్రపంచంలోనే భారత వైద్యుల ఘనత..

ఇలాంటి సర్జరీ చేయడం ప్రపంచంలోఏ మొదటిసారి. 4 గంటలపాటు జరిగిన శస్త్రచికిత్సలో బాలికకు మత్తుమందు ఇవ్వలేదు. ఇలాంటి అరుదైన ఆపరేషన్‌ చేసి ఎయిమ్స్ వైద్యులు రికార్డు సృష్టించారు. ఎయిమ్స్‌ నివేదిక ప్రకారం...ఒకటో తరగతి చదువుతున్న ఆక్షిత మూర్ఛ వ్యాధితో బాధపడుతోంది. ఆ చిన్నారి మెదడు ఎడమ భాగంలో కణతులు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. వాటిని తొలగించేందుకు ఎయిమ్స్‌ న్యూరో సర్జరీ ప్రొఫెసర్‌ దీపక్‌ గుప్తా నేతృత్వంలోని బృందం రంగంలోకి దిగింది.

5ఏళ్ల బాలికకు అరుదైన వ్యాధి.. స్పృహలో ఉండగానే బ్రెయిన్‌ సర్జరీ.. ప్రపంచంలోనే భారత వైద్యుల ఘనత..
Awake Brain Tumor Surgery
Jyothi Gadda
|

Updated on: Jan 08, 2024 | 7:09 AM

Share

భారత వైద్యులు అరుదైన ఘనత సాధించారు. వైద్య చరిత్రలోనే తొలిసారిగా అద్భుత శస్త్రచికిత్స చేసిన చరిత్ర సృష్టించారు మన డాక్టర్లు. ఎయిమ్స్‌లో తొలిసారిగా మత్తు లేకుండా మెదడుకు శస్త్ర చికిత్స నిర్వహించి 5 ఏళ్ల బాలిక మెదడు నుంచి కణితిని తొలగించారు. స్పృహ కోల్పోకుండా ఓ బాలిక బ్రెయిన్ ట్యూమర్‌ను తొలగించేందుకు ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు. ఇలాంటి సర్జరీ చేయడం ప్రపంచంలోఏ మొదటిసారి. 4 గంటలపాటు జరిగిన శస్త్రచికిత్సలో బాలికకు మత్తుమందు ఇవ్వలేదు. ఇలాంటి అరుదైన ఆపరేషన్‌ చేసి ఎయిమ్స్ వైద్యులు రికార్డు సృష్టించారు. ఎయిమ్స్‌ నివేదిక ప్రకారం…ఒకటో తరగతి చదువుతున్న ఆక్షిత మూర్ఛ వ్యాధితో బాధపడుతోంది. ఆ చిన్నారి మెదడు ఎడమ భాగంలో కణతులు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. వాటిని తొలగించేందుకు ఎయిమ్స్‌ న్యూరో సర్జరీ ప్రొఫెసర్‌ దీపక్‌ గుప్తా నేతృత్వంలోని బృందం రంగంలోకి దిగింది.  బ్రెయిన్ ట్యూమర్ లో రోగిని మెలకువగా ఉంచి సర్జరీ చేయడాన్ని అవేక్‌ క్రానియోటమీ అంటారు. ఇలా చేయడం ద్వారా పూర్తిగా కణతులను తీసి వేయడంతో పాటు నరాల సంబంధిత లోపాలను నివారించేందుకు తోడ్పడుతుంది.

డాక్టర్ దీపక్ గుప్తా, ఢిల్లీ ఎయిమ్స్ సర్జరీ విభాగం ప్రొఫెసర్, అనస్థీషియా విభాగానికి చెందిన డాక్టర్ మిహిర్ పాండ్యా, వారి 5 మంది సహచరులు సుమారు 4 గంటల పాటు ఈ శస్త్రచికిత్స చేశారు. ఈసారి అమ్మాయి కూడా చాలా ధైర్యం చూపించింది. ఆమె వైద్యులకు సహకరిస్తూనే ఉంది. శస్త్రచికిత్స తర్వాత ఆమె ఇంకా చాలా చురుకుగా ఉంది. కానీ ఆమె మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి నిద్రపుచ్చమని వైద్యులు వెల్లడించారు. ఆపరేషన్‌ సమయంలో అమ్మాయి కొన్నిసార్లు నవ్వుతూ, కొన్నిసార్లు ఆడుకుంటూ కనిపించింది..ఆ సమయంలో వైద్యులు చిన్నారికి మొబైల్‌లో ఫొటోలు, వీడియోలు చూపించారు. 5 ఏళ్ల 10 నెలల చిన్నారి ధైర్యం చూసి టీమ్‌కి కూడా ధైర్యం వచ్చిందన్నారు. మత్తుమందు ఇవ్వకూడదని తెలిసి కూడా సర్జరీకి సిద్ధపడిన వైద్యులకు ఇది ఒక సవాలు లాంటిది. ఎందుకంటే ఎలాంటి చిన్న తప్పు జరిగినా కూడా ఆ అమ్మాయి ప్రాణం పోయే ప్రమాదమే ఎక్కువ.

ఇవి కూడా చదవండి

బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న బాలిక ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ నివాసి అని డాక్టర్ మిహిర్ పాండ్యా తెలిపారు. ఆస్పత్రికి వచ్చేసరికి తలనొప్పి, వాంతులు చేసుకుంది. ఆమెకు మూర్ఛ వ్యాధి కూడా వచ్చింది. తదుపరి పరీక్షల్లో ఆమెకు బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్లు తేలింది. ఆమెకు ఎడమ పెరిసిల్వియన్ ఇంట్రాక్సియల్ బ్రెయిన్ ట్యూమర్ ఉంది. రెండేళ్ల క్రితం బాలికకు శస్త్రచికిత్స జరిగినా.. కణితిలో కొంత భాగం మెదడులోనే ఉండి తిరిగి పెరిగింది. బాలిక పరిస్థితిని చూసిన వైద్యులు వెంటనే శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. జనవరి 4వ తేదీ ఉదయం వైద్యులు బాలిక పుర్రెకు 16 ఇంజక్షన్లు వేశారు. ఆ తర్వాత శస్త్ర చికిత్స ప్రారంభించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..