Viral Video: ఉబెర్ డ్రైవర్ నిర్వాకం.. డ్రైవింగ్ చేస్తూ ఏం చేస్తున్నాడో చూడండి..! పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్యాసింజర్..
అప్పుడప్పుడు ఇలాంటి ఓలా, ఉబెర్ డ్రైవర్లు కూడా తప్పులు చేస్తుంటారు.. డ్రైవర్ల నిర్లక్షం ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలో పడేసే సంఘటనలు కూడా మనం చూస్తుంటాం.. ఇక్కడ కూడా ఓ వ్యక్తి ఉబర్ డ్రైవర్‌పై ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదుకు కారణమైన వీడియోను సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో షేర్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది..ఆ వీడియోలో,.
రవాణా వ్యవస్థ ఎంతగా విస్తరించినా కూడా ప్రజలకు సరిపోవడం లేదనే చెప్పాలి… బస్సులు, రైళ్లు, విమానాలు కాకుండా..లోకల్ ప్యాసింజర్ ట్రైన్లు, మెట్రో రైళ్లు సైతం బాగా పెరిగాయి. ఈ క్రమంలోనే ముఖ్యంగా మెట్రో నగరాల్లో ఓలా, ఉబర్ వంటి కంపెనీల ద్వారా కార్లు, ఆటోలు, టూవీలర్ వాహనాలు కూడా అందుబాటులోకి వచ్చేశాయి. సిటీల్లోని ప్రజలు తరచుగా ఓలా, ఉబర్‌ను ఆశ్రయిస్తారు. బుకింగ్ చేసిన క్షణాల్లోనే క్యాబ్ మీ వద్దకు వచ్చేస్తుంది. మీరు వెళ్లాల్సిన ప్రదేశానికి మిమ్మల్ని సురక్షితంగా తీసుకువెళ్తుంది. అయితే, అప్పుడప్పుడు ఇలాంటి ఓలా, ఉబెర్ డ్రైవర్లు కూడా తప్పులు చేస్తుంటారు.. డ్రైవర్ల నిర్లక్షం ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలో పడేసే సంఘటనలు కూడా మనం చూస్తుంటాం.. ఇక్కడ కూడా ఓ వ్యక్తి ఉబర్ డ్రైవర్‌పై ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదుకు కారణమైన వీడియోను సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో షేర్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది..ఆ వీడియోలో, కారు రోడ్డుపై వెళ్తోంది. డ్రైవర్ చెవుల్లో ఇయర్‌బడ్‌లు, ఒక చేతిలో మొబైల్ ఫోన్ పట్టుకుని ఉన్నాడు. కారు నడుపుతూ అతడు.. పదే పదే తన మొబైల్ ఫోన్ చూసుకుంటున్నాడు..
వీడియోను షేర్ చేయడం ద్వారానే ఆ వినియోగదారుడు ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డ్రైవర్ ప్రమాదకరమైన డ్రైవింగ్ చేస్తున్నారని, అందుకే తాను సురక్షితంగా ప్రయాణించడం లేదని పేర్కొన్నాడు. ఈ డ్రైవర్ తన ఫోన్‌ను ఒడిలో పెట్టుకుని మొబైల్‌లో వీడియో చూస్తున్నాడని చెప్పాడు. వినియోగదారు తన పోస్ట్‌లో ముంబై పోలీస్, ఉబర్ సంస్థను కూడా ట్యాగ్ చేశాడు.
I am not feeling safe to travel in @Uber_India these days as these days the drivers are driving dangerously. This driver is watching videos on his mobile by putting his phone on his lap. @MTPHereToHelp this happened in Mumbai. What will you do to stop this? @Uber_Mumbai pic.twitter.com/AY7sgCsRe3
— Venkat 🐶 (@snakeyesV1) January 5, 2024
ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారడంతో జనాలు కూడా స్పందిస్తున్నారు. నేనైతే ఫోన్ స్విచ్ ఆఫ్ చేయమని చెప్పేవాడిని అంటున్నారు ఒకరు. ఆ కారులోంచి దిగి ఉండేవాడినని మరో వ్యక్తి వ్యాఖ్యనించాడు.. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వీడియోలు చూడటం చాలా ప్రమాదకరం, అది మూర్ఖత్వం అని ఒకరు రాశారు. పెద్ద ప్రమాదాలు ఇలాగే జరుగుతాయని, జాగ్రత్త చాలా ముఖ్యం అని ఒకరు రాశారు.
కాగా, దీనిపై స్పందించిన ముంబై పోలీసులు వాహనం, ప్రయాణానికి సంబంధించిన సమాచారం ఇవ్వాలని కోరారు. అయితే ఉబెర్ స్పందిస్తూ మీరు దీని గురించి వెంటనే ఉబర్‌కు ఫిర్యాదు చేయవచ్చునని, ఇలాంటి వారిపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..