Chilgoza Seeds: చిల్గోజా గింజలు తెలుసా..? ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..
చలికాలంలో డ్రై ఫ్రూట్స్ తినటం చాలా ప్రయోజనకరంగా చెబుతారు. డ్రై ఫ్రూట్స్‌లో విటమిన్లు మరియు మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇక, డ్రై ఫ్రూట్స్ విషయానికి వస్తే జీడిపప్పు, బాదం, ఎండు ద్రాక్ష, వాల్‌నట్ వంటి వాటి పేర్లు గుర్తుకు వస్తాయి. అయితే అన్ని డ్రై ఫ్రూట్స్ కంటే శక్తివంతమైన డ్రై ఫ్రూట్ ఒకటి ఉంది. అంతేకాదు.. ఇది వింటర్ స్పెషల్ డ్రై ఫ్రూట్ కూడా. అది చిల్గోజా.. దీనిని పైట్ నట్ అని అంటారు. ఈ పండు విత్తనాల్ని డ్రై ఫ్రూట్‌గా వాడతారు. తియ్యగా ఉండే ఈ నట్స్‌తో ఎన్నో ప్రయోజనాలున్నాయి.
Updated on: Jan 07, 2024 | 8:58 PM

చిల్గోజా సీడ్స్‌తో పాటు దానిని నూనె కూడా ఆరోగ్యానికి ప్రయోజనం.. దీనిని అనేక ఆయుర్వేద ఔషధాల్లో ఉపయోగిస్తారు. చిల్గోజా సీడ్స్ తినడం వల్ల శరీరానికి బలం అందుతుంది.. బలహీనత తొలగిపోతుంది. చలికాలంలో చిల్గోజా గింజలు తినడం వల్ల శరీరానికి కావాల్సిన వెచ్చదనం దొరుకుతుంది. అలాగే ఎముకలు దృఢంగా మారతాయి.

చిల్గోజా గింజల్లో కాటెచిన్, లుటిన్, లైకోపీన్, కెరోటినాయిడ్స్, టెకోఫెరాల్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని అందిస్తాయి. అనేక అనారోగ్యాల నుంచి కాపాడతాయి. పైన్ నట్స్ తీసుకోవడం మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తుంది. ఇది శరీరంలో ఇన్సులిన్‌ను ఉత్తేజపరిచి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల డయాబెటిస్ లక్షణాలను తగ్గించుకోవచ్చు.

చిల్గోజా గింజల్ని ఫేస్ స్క్రబ్‌గా కూడా ఉపయోగిస్తారు. పైన్ గింజల్ని పొడిచేసి సమాన పరిమాణంలో బియ్యం పిండిని కలపాలి. ఇందులో నీళ్లు పోసి పేస్ట్‌లా చేసి స్క్రబ్‌లా అప్లై చేయాలి. దీంతో చర్మం లోతుగా మాయిశ్చరైజ్ చేస్తుంది. చిల్గోజా గింజలు ఒత్తైన జుట్టును అందిస్తాయి. పైన్ నట్స్ తినడం వల్ల లేదా పైన్ నట్ నూనె జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు సమస్యలు తగ్గుతాయి.

చలికాలంలో ఆర్థరైటిస్ రోగుల సమస్యలు గణనీయంగా పెరుగుతాయి. అటువంటి పరిస్థితిలో, పైన్ గింజలను తీసుకోవడం వల్ల గౌట్ నొప్పి, వాపు నుండి ఉపశమనం పొందవచ్చు. ఇందులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. దీన్ని తీసుకుంటే చేతులు, కాళ్ల నొప్పులు తగ్గుతాయి

పైన్ గింజలను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు మరియు అసంతృప్త కొవ్వులు ఉంటాయి, ఇవి చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడతాయి. ఇందులోని ఫోలిక్ యాసిడ్ శరీరంలోని ట్రైగ్లిజరైడ్స్‌ను తొలగించడంలో సహాయపడుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.





























