AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏం టాలెంట్ గురూ ..! పాత టీవీని అయోధ్యగా మార్చేశాడు.. ఆ సీతారాములనే రప్పించాడు..!! జై శ్రీరామ్‌ అంటూ..

ఇది నిజంగా నెక్ట్స్‌ లెవల్‌ టాలెంట్‌ గురూ అంటూ ఒకరు వ్యాఖ్యానించగా, యువకుడి ప్రతిభకు వందనం అని మరొకరు రాశారు. ఇది అద్భుతమైన ప్రతిభ, అద్భుతమైన సృజనాత్మకత.. నా జీవితంలో ఇంత అందమైన కళను చూడలేదని ఇంకొకరు రాశారు. ఇది అందం కంటే అందంగా ఉందని ఒకరు రాయగా.. ఇది సాధ్యమేనా? నా కళ్లను నేనే నమ్మలేకపోతున్నాను అంటూ ఒక నెటిజన్‌ స్పందించారు.

ఏం టాలెంట్ గురూ ..! పాత టీవీని అయోధ్యగా మార్చేశాడు.. ఆ సీతారాములనే రప్పించాడు..!! జై శ్రీరామ్‌ అంటూ..
Breaking A Tv
Jyothi Gadda
|

Updated on: Jan 07, 2024 | 8:29 PM

Share

అయోధ్యలో ఈ నెల 22న మధ్యాహ్నం 12.20 గంటలకు రామ్‌లల్లా (బాల రాముడు) విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. ఈ మేరకు ప్రారంభోత్సవ సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. అయోధ్య రాముడి ఆలయ ప్రారంభోత్సవం కోసం దేశ వ్యాప్తంగా విపరీతమైన ఉత్కంఠ నెలకొంది. రామభక్తులు తమ భక్తిని చాటుకుంటున్నారు. శ్రీరాముడి పెయింటింగ్స్‌, పోస్టర్లు వంటివి ఇప్పటికే దేశవ్యాప్తంగా విపరీతంగా మార్కెట్‌ అవుతున్నాయి. కొంతమంది కళాకారులు రాముడి పెయింటింగ్స్, ఆర్ట్‌వర్క్స్ చేస్తూ తమ కళను ప్రపంచానికి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక వ్యక్తి టీవీని పగలగొట్టి రాముడి కళాఖండాన్ని రూపొందించాడు .

వీడియోలో, కనిపించే వ్యక్తి ఎదురుగా టీవీ, అతని ముందు ఒక సుత్తి పెట్టుకుని కూర్చొని ఉన్నాడు. అతను టీవీని ముక్కలు ముక్కలుగా విచ్ఛినం చేశాడు.. ఆ తర్వాత టీవీ పార్ట్స్‌ అన్ని కలిపి.. అద్భుతమైన కళాకృతిని రూపొందించాడు. టీవీని పగలగొట్టిన తర్వాత అతడు.. ఆ టీవీలోపల అంతర్గత భాగాలను ఉపయోగించాడు. వాటిని టీవీలో అలంకరించాడు.. ఏర్పడిన నీడలో రామాలయం, రాముడు, సీమ్మ తల్లి, లక్ష్మణుడి చిత్రాలు కనిపించేలా అద్భుతాన్ని ఆవిష్కరించారు. ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా మంది వీక్షిస్తున్నారు. ప్రజలు దీన్ని ఎంతగానో ఇష్టపడుతున్నారు. ఈ వీడియో 4 రోజుల క్రితం షేర్ చేయబడింది. అప్పుడే ఈ వీడియోను 4 మిలియన్ల మందికి పైగా లైక్ చేయగా, వీడియోను 40 మిలియన్ల మంది వీక్షించారు. ఈ వీడియోపై 77 వేల మందికి పైగా వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి

ఇది నిజంగా నెక్ట్స్‌ లెవల్‌ టాలెంట్‌ గురూ అంటూ ఒకరు వ్యాఖ్యానించగా, యువకుడి ప్రతిభకు వందనం అని మరొకరు రాశారు. ఇది అద్భుతమైన ప్రతిభ, అద్భుతమైన సృజనాత్మకత.. నా జీవితంలో ఇంత అందమైన కళను చూడలేదని ఇంకొకరు రాశారు. ఇది అందం కంటే అందంగా ఉందని ఒకరు రాయగా.. ఇది సాధ్యమేనా? నా కళ్లను నేనే నమ్మలేకపోతున్నాను అంటూ ఒక నెటిజన్‌ స్పందించారు.

@artist_shintu_mourya అనే ఖాతాతో వీడియో షేర్ చేయబడింది. ఈ వీడియో చూసిన తర్వాత ప్రజలు దీనిని నమ్మశక్యం కానిదిగా చెబుతున్నారు. వేలాది మంది ప్రజలు జై శ్రీరామ్ అని కామెంట్స్‌లో రాశారు. ప్రజలు వీడియోను బాగా ఇష్టపడుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..