Omega-3 Fatty Acids: ​ఒమేగా – 3 ఫ్యాటీ యాసిడ్స్‌ రిచ్‌ ఫుడ్స్‌ ఎందుకు తినాలి.. దీని వల్ల లాభాలేంటో తెలుసా..?

వాల్‌నట్‌లు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌కు అద్భుతమైన మూలం. మెగ్నీషియం, కాపర్, విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న వాల్‌నట్స్ రక్తపోటును నియంత్రించడంలో, మధుమేహాన్ని నియంత్రించడంలో, గుండె ఆరోగ్యం, మెదడు ఆరోగ్యం, కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో గ్రేట్ గా సహాయపడుతాయి.

Omega-3 Fatty Acids: ​ఒమేగా - 3 ఫ్యాటీ యాసిడ్స్‌ రిచ్‌ ఫుడ్స్‌ ఎందుకు తినాలి.. దీని వల్ల లాభాలేంటో తెలుసా..?
Omega 3 Fatty Acids
Follow us

|

Updated on: Jan 07, 2024 | 6:30 PM

ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. ఇవి ఆరోగ్యకరమైన కొవ్వులు. ఒమేగా 3 ఆమ్లాలు మెదడు ఆరోగ్యానికి, కాలేయ ఆరోగ్యానికి, గుండె ఆరోగ్యానికి ముఖ్యమైనవి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల డిప్రెషన్, ఒత్తిడి, ఆందోళన తగ్గుతుందని కూడా కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే ఆహారాన్ని తినడం గుండె, చర్మ ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి మంచిది. లివ‌ర్‌లో కొవ్వు పెర‌గ‌కుండా అడ్డు క‌ట్ట వేయ‌డంలోనూ, నెల‌స‌రి స‌మ‌యంలో నొప్పుల‌ను నివారించ‌డంలోనూ, బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్‌ను కంట్రోల్ చేయ‌డంలోనూ.ఇలా ఎన్నో విధాలుగా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉప‌యోగ‌ప‌డతాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్న కొన్ని ఆహార పదార్థాలు, వాటి వల్ల కలిగే లాభాలను తెలుసుకుందాం…

సాల్మన్ ఫిష్ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అద్భుతమైన మూలం. అలాగే, వీటిలో విటమిన్ డి, బి, ఇతర ప్రోటీన్లు ఉంటాయి. ఇవి శరీరానికి చాలా మేలు చేస్తాయి.

వాల్‌నట్‌లు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌కు అద్భుతమైన మూలం. మెగ్నీషియం, కాపర్, విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న వాల్‌నట్స్ రక్తపోటును నియంత్రించడంలో, మధుమేహాన్ని నియంత్రించడంలో, గుండె ఆరోగ్యం, మెదడు ఆరోగ్యం, కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో గ్రేట్ గా సహాయపడుతాయి.

ఇవి కూడా చదవండి

గుడ్లు కూడా ఓమేగా-3 అధికంగా లభించే ఆహారం. గుడ్లలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్లు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.

అలాగే, సోయాబీన్స్‌లో ఫైబర్, విటమిన్ కె, మెగ్నీషియం, పొటాషియంతో పాటు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌లు పుష్కలంగా ఉన్నాయి.

అవిసె గింజలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్, ఫైబర్, మెగ్నీషియం పుష్కలంగా ఉండటం వల్ల మెదడు ఆరోగ్యానికి చాలా మంచిది.

చియా విత్తనాల్లో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారంలో వీటిని చేర్చుకోవడం వల్ల శరీర ఆరోగ్యానికి చాలా మంచిది.

ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్.శ‌రీరానికి కావాల్సిన అతి ముఖ్య‌మైన పోష‌కాల్లో ఇదీ ఒక‌టి.

జనపనార గింజలు ALAతో సహా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ నిండి ఉంటాయి. జనపనార గింజలను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ALA శరీరంలో వాపును తగ్గిస్తుంది. మొత్తం రోగనిరోధక పనితీరును మెరుగుపరుస్తుంది.

(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..
మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి
మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి
ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!
ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!
హౌతీ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ పంజా.! యెమెన్‌లో భీకర దాడులు..
హౌతీ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ పంజా.! యెమెన్‌లో భీకర దాడులు..