Most Expensive Fish: బాబోయ్ బంగారం కంటే ఖరీదైన చేప.. వేలంలో రూ.6.5 కోట్లు పలికిన ధర
బ్లూఫిన్ అతిపెద్ద లోతైన సముద్ర జీవరాశి. అవి టార్పెడో ఆకారాన్ని కలిగి ఉంటాయి. 40 సంవత్సరాల వరకు జీవిస్తుంది. అవి మత్స్యకారుల వలల్లోంచి జారి వేగంగా తప్పించుకుంటాయి. ట్యూనా కింగ్‌గా పేరుగాంచిన సుషీ వ్యాపారవేత్త కియోషి కిమురా 2019లో 27 కోట్ల రూపాయలకు ట్యూనాను కొనుగోలు చేశారు. జపాన్‌లో ఇప్పటి వరకు బద్దలు కొట్టని రికార్డు ఇది.
జపాన్‌లోని టోక్యోలో ఒక ట్యూనా చేప 6.5 కోట్ల రూపాయలకు (114.2 మిలియన్ జపనీస్ యెన్) విక్రయించబడింది. దాని బరువు 238 కిలోలు ఉన్నట్టుగా తెలిసింది.. టోక్యోలోని అతిపెద్ద చేపల మార్కెట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. గత ఏడాదితో పోలిస్తే బ్లూఫిన్ ట్యూనా చేప ధర ఏకంగా మూడున్నర రెట్లకుపైగా పెరిగింది. ప్రపంచంలో అత్యంత ఖరీదైన చేపగా పేరున్న బ్లూఫిన్ ట్యూనా రకానికి చెందినది ఈ చేప. జపాన్ రాజధాని టోక్యోలో జరిగిన వార్షిక వేలంలో బ్లూఫిన్ ట్యూనా చేప 114.24 మిలియన్ యెన్‌ల ధర పలికింది. ఇది 7 లక్షల 88 వేల 471 అమెరికా డాలర్లకు సమానం కాగా భారత కరెన్సీలో ఆరున్నర కోట్లకుపైనే ఉంటుంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి వేలంలో బ్లూఫిన్ ట్యూనా చేప ధర మూడురెట్లు పెరిగినట్టు… నిర్వాహకులు తెలిపారు. ఈ బ్లూఫిన్ ట్యూనా చేప బరువు 238 కిలోలు కాగా అమోరి ప్రిఫెక్చర్‌లోని ఓమా అనే ప్రాంతంలో ఈ చేపను పట్టుకున్నట్టు తెలిపారు.
ఈ చేప ఒనోడెరాలోని మిచెలిన్ స్టార్డ్ రెస్టారెంట్‌లో కస్టమర్లకు సర్వ్ చేస్తారు. బ్లూఫిన్ ట్యూనా బంగారం కోసం విక్రయించబడింది. ఉత్తర జపాన్‌లోని అమోరి ప్రిఫెక్చర్ తీరంలో ట్యూనా పట్టుబడింది. టోక్యోలోని సుషీ రెస్టారెంట్ ఎగ్జిక్యూటివ్ చెఫ్ అకిఫుమి సకాగామి ఆ చేపను కొనుగోలు చేశారు.
బ్లూఫిన్ అతిపెద్ద లోతైన సముద్ర జీవరాశి. అవి టార్పెడో ఆకారాన్ని కలిగి ఉంటాయి. 40 సంవత్సరాల వరకు జీవిస్తుంది. అవి మత్స్యకారుల వలల్లోంచి జారి వేగంగా తప్పించుకుంటాయి. ట్యూనా కింగ్‌గా పేరుగాంచిన సుషీ వ్యాపారవేత్త కియోషి కిమురా 2019లో 27 కోట్ల రూపాయలకు ట్యూనాను కొనుగోలు చేశారు. జపాన్‌లో ఇప్పటి వరకు బద్దలు కొట్టని రికార్డు ఇది.
ఇక, కోవిడ్ అనంతరం పర్యాటక అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి సుషీ (జపనీస్ ఫుడ్) రెస్టారెంట్ వ్యాపార సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. జపాన్ నేషనల్ టూరిజం ఆర్గనైజేషన్ ప్రకారం, అక్టోబర్ 2023 నాటికి జపాన్ సందర్శకుల సంఖ్య 2.52 మిలియన్లకు చేరుకుందని, అక్టోబర్ 2019లో ఇది 2.5 మిలియన్లుగా ఉందని చెప్పారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..