మూక హత్యల ప్రసారాలపై ఘాటుగా స్పందించిన కేంద్రమంత్రి

మూకదాడులల్లో రకాలను చూస్తున్నారంటూ మండిపడ్డారు కేంద్ర సమాచార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్. దేశంలో అనేక చోట్ల అనేక రకాల మూక హత్యలు జరుగుతున్నా.. కేవలం ఒక వర్గానికి సంబంధించిన వాటిపైనే ప్రచారం ఎక్కువ జరుగుతుందన్నారు. గతంలో ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాల్లో జరిగిన మూకదాడులపై మీడియా ఎక్కువ ప్రాధాన్యతనిచ్చిందని.. అవన్నీ కేవలం ఒక వర్గానికి సంబంధించినవేనని.. అదే సమయంలో ఇతర ప్రాంతాల్లో వేరే కారణాలతో జరిగే మూక హత్యలపై సైలంట్‌గా ఉందన్నారు. ఫేక్ న్యూస్ వ్యాప్తి […]

మూక హత్యల ప్రసారాలపై ఘాటుగా స్పందించిన కేంద్రమంత్రి
Follow us

| Edited By:

Updated on: Nov 17, 2019 | 3:09 AM

మూకదాడులల్లో రకాలను చూస్తున్నారంటూ మండిపడ్డారు కేంద్ర సమాచార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్. దేశంలో అనేక చోట్ల అనేక రకాల మూక హత్యలు జరుగుతున్నా.. కేవలం ఒక వర్గానికి సంబంధించిన వాటిపైనే ప్రచారం ఎక్కువ జరుగుతుందన్నారు. గతంలో ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాల్లో జరిగిన మూకదాడులపై మీడియా ఎక్కువ ప్రాధాన్యతనిచ్చిందని.. అవన్నీ కేవలం ఒక వర్గానికి సంబంధించినవేనని.. అదే సమయంలో ఇతర ప్రాంతాల్లో వేరే కారణాలతో జరిగే మూక హత్యలపై సైలంట్‌గా ఉందన్నారు. ఫేక్ న్యూస్ వ్యాప్తి వైరస్ లాంటిదని.. వీటి ద్వారా అనేక అనర్థాలు జరుగుతున్నాయన్నారు. గతంలో యూపీఏ అధికారంలో ఉన్న సమయంలో పిల్లలను ఎత్తుకెళ్తున్నారంటూ వచ్చిన పుకార్లు విపరీతంగా వ్యాపించాయని.. ఆ సమయంలో ఆ ఫేక్ న్యూస్ నిజమేనని నమ్మిన ప్రజలు.. అనుమానంగా కనిపించిన వారిపై ప్రజలు దాడులకు పాల్పడ్డారని.. ఈ ఘటనలో ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారన్నారు. ఇలాంటి ఘటనలు 2012లో 16, 2013లో 14 జరిగాయనీ.. అప్పుడు వీటిపై ఏ మీడియా సంస్థ కూడా స్పెషల్ డిబేట్‌లు పెట్టలేదంటూ విమర్శించారు.

ఫేక్ న్యూస్‌ వ్యాప్తి ద్వారా జరిగే అనర్థాలను ప్రజలకు వివరించేలా ప్రత్యేక కార్యక్రమాలు ఉండాలని.. ప్రజల్లో చైతన్యం వస్తే ఇలాంటి ఘటనలు పునరావృతం కావన్నారు. కాగా, గతేడాది తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. గ్రామాల్లోకి పిల్లలను ఎత్తుకెళ్లే ముఠాలు వస్తున్నాయంటూ ఫేక్ న్యూస్ వాపించడంతో అనేక చోట్ల మూకదాడులు జరిగాయి. ఈ దాడుల్లో అనేక మంది ప్రజల చేతిలో గాయపడ్డారు. పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు. అదే సమయంలో పోలీసులు చొరవ తీసుకుని.. ప్రజల్లో అవగాహన కల్పించడంతో ఈ ఫేక్‌ న్యూస్‌కి చెక్ పడ్డట్లైంది.