సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు.. విపక్షంగా మారిన మిత్రపక్షం

పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈనెల 18న ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో గత కొన్నేళ్లుగా మిత్రులుగా ఉన్న పార్టీలు.. ఈ సమావేశంలో శత్రువులుగా మారనున్నారు. ఈ సారి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వర్షాకాల సమావేశాల్లో మిత్రపక్షంగా ఉన్న శివసేన.. శీతాకాల సమావేశంలో విపక్షంలో కూర్చోనుంది. దీనికి అసలు కారణం.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలు. గత నెలలో జరిగిన ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ, శివసేన పార్టీలు కలిసి పోటీ చేశాయి. అయితే ఫలితాలు వెలువడిన తర్వాత ఇరు […]

సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు.. విపక్షంగా మారిన మిత్రపక్షం
Follow us

| Edited By:

Updated on: Nov 17, 2019 | 6:25 AM

పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈనెల 18న ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో గత కొన్నేళ్లుగా మిత్రులుగా ఉన్న పార్టీలు.. ఈ సమావేశంలో శత్రువులుగా మారనున్నారు. ఈ సారి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వర్షాకాల సమావేశాల్లో మిత్రపక్షంగా ఉన్న శివసేన.. శీతాకాల సమావేశంలో విపక్షంలో కూర్చోనుంది. దీనికి అసలు కారణం.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలు. గత నెలలో జరిగిన ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ, శివసేన పార్టీలు కలిసి పోటీ చేశాయి. అయితే ఫలితాలు వెలువడిన తర్వాత ఇరు పార్టీల మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ, శివసేనకు కావాల్సిన బలం ఉన్నా.. సీఎం సీటు విషయంలో విభేదాలు వచ్చాయి. దీంతో శివసేన పార్టీ.. ఎన్సీపీ, కాంగ్రెస్‌తో చేతులు కలిపేందుకు సిద్దమైంది. శివసేనకు సీఎం పదవి దక్కాలన్న మొండిపట్టుదలతో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే కేంద్ర మంత్రిగా ఉన్న శివసేన నేత.. రాజీనామా కూడా చేయడం సంచలనంగా మారింది. అంతేకాదు.. ఇక బీజేపీతో దోస్తీ కట్ అయినట్లేనంటూ సంకేతాలు కూడా పంపింది.

ఇక పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్డీయే మిత్రపక్షాలు ఆదివారం భేటీ కానున్నాయి. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చించన్నారు. ఈ సమావేశానికి ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా కూడా హాజరుకానున్నారు. అయితే ఈ సమావేశానికి శివసేన హాజరుకాబోమని తెలిపినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో సోమవారం నుంచి జరగబోయే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో శివసేన విపక్ష బెంచీల్లో కూర్చోనుంది. అంతేకాదు.. రాజ్యసభలో శివసేన ఎంపీలు కూర్చునే సీట్లలో మార్పులు కూడా చోటుచేసుకోనున్నాయి. శివసేన రాజ్యసభ ఎంపీలు సంజయ్ రౌత్, అనిల్ దేశాయ్‌‌లు విపక్ష సీట్లలో కూర్చుంటారని, ఈ మేరకు సీట్ల ఏర్పాట్లలో మార్పులు చోటుచేసుకోనున్నాయని చెబుతున్నారు. ఎగువసభలో శివసేనకు ముగ్గురు ఎంపీలు ఉన్నారు. అంతేకాదు.. పార్లమెంట్‌లో యూపీఏతో చేతులు కలిపి ఎన్డీఏపై ఫైర్ అయ్యే అవకాశం ఉంది.

Latest Articles
తెలుగు రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ మరో రెండు రోజుల పాటు వర్షాలు 
తెలుగు రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ మరో రెండు రోజుల పాటు వర్షాలు 
పసిడి ప్రియులకు స్వల్ప ఊరట.. హైదరాబాద్‎లో తులం ధర ఎంతంటే..
పసిడి ప్రియులకు స్వల్ప ఊరట.. హైదరాబాద్‎లో తులం ధర ఎంతంటే..
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..