మాస్క్‏ను ఎప్పుడూ ధరించడం వలన ఆక్సిజన్ లెవల్స్ తగ్గిపోతాయా ? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

Fact Check: కరోనా వైరస్.. కంటికి కనిపించకుండానే యావత్ భారతాన్ని వణికిస్తోంది. గత సంవత్సర కాలంగా ఈ మహమ్మారి ప్రజలను భయాందోళనలకు గురిచేస్తుంది.

మాస్క్‏ను ఎప్పుడూ ధరించడం వలన ఆక్సిజన్ లెవల్స్ తగ్గిపోతాయా ? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Covid Mask

Fact Check: కరోనా వైరస్.. కంటికి కనిపించకుండానే యావత్ భారతాన్ని వణికిస్తోంది. గత సంవత్సర కాలంగా ఈ మహమ్మారి ప్రజలను భయాందోళనలకు గురిచేస్తుంది. తగ్గింది అనుకునేలోపే తిరిగి మళ్లీ తన ప్రతాపాన్ని చూపిస్తుంది. రోజూకీ 4 లక్షల కేసులు నమోదవుతుండగా… మరణాల రేటు కూడా ఎక్కువగా ఉంది. ఇదిలా ఉంటే.. దేశంలో ఆసుపత్రులలో ఆక్సిజన్ కొరత, బెడ్స్ కొరత మరింత తీవ్రంగా బాధిస్తోంది. ఆక్సిజన్ కొరతతో వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఇటీవల నిపుణులు ఇంట్లో ఉన్నాకానీ నిత్యం మాస్క్ ధరించాలని.. బయటకు వెళ్ళినప్పుడు డబుల్ మాస్క్ ధరించాలని సూచిస్తున్నారు.

సాధారణంగా మానవ శరీరానికి రోజుకు 550 లీటర్ల ఆక్సిజన్ అవసరం. ERV ఈ అవసరాన్ని సులభంగా తీరుస్తుంది. అయితే మాస్క్ ధరించడం వలన శరీరానికి 250 నుంచి 300 లీటర్ల ఆక్సిజన్ మాత్రమే సరఫరా అవుతుందని.. మాస్క్ ధరించడం వలన శరీరంలో కార్బన్ డయాక్సైడ్ స్థాయి పెరుగుతుంది. అందుకే మాస్క్ ధరించడమనేది ప్రమాదకరమని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ న్యూస్ పై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బేరు యొక్క ఫ్యాక్ట్ చెక్ టీం దర్యాప్తు చేపట్టింది. కానీ అసలు నిజమేంటంటే మాస్క్ ఉపయోగించడం వలన ఆక్సిజన్ లెవల్స్ తగ్గుతాయనే వార్త నకిలిదని.. అందుకు శాస్త్రీయ ఆధారాలు ఏవి లేవని స్పష్టం చేసింది.

దేశంలో కరోనా సెకండ్ వేవ్ లో ఇటీవల కేసుల సంఖ్య తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో మూడున్నర మిలియన్ల లోపు కొత్త కేసులు నమోదయ్యాయి. గత కొన్ని రోజులుగా దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య స్థిరంగా నాలుగు లక్షలు దాటింది. కానీ ఇప్పుడు వరుసగా రెండోరోజు కరోనా రోగుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. గత 24 గంటల్లో దేశంలో 3 లక్షల 29 వేల 942 కొత్త కేసులు నమోదుకాగా. 3,876 మంది ప్రాణాలు కోల్పోయారు. గత కొన్ని రోజులుగా 3,5682 మంది రికవరీ అయ్యారు.

ట్వీట్..

Also Read: Indian- 2 Movie: ఇండియన్ 2 సినిమాకు తగ్గని సమస్యలు.. పరిష్కార బాటలో కమల్ హాసన్..