Encounter: అనంతనాగ్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం..
Three militants killed in encounter: జమ్మూకాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో
Three militants killed in encounter: జమ్మూకాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు టెర్రరిస్టులు హతమయ్యారు. అనంత్‌నాగ్ జిల్లా కోమెర్‌నాగ్ ప్రాంతంలోని వైలూలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు మంగళవారం గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు సైన్యంపై కాల్పులు ప్రారంభించారు. దీంతో భద్రతా బలగాల ఎదురుకాల్పుల్లో ముష్కరులు హతమయ్యాడని కాశ్మీర్ పోలీసు అధికారి విజయ్‌కుమార్ వెల్లడించారు.
సమాచారం మేరకు తెల్లవారుజామున సెర్చ్ ఆపరేషన్ నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు పోలీసులపై కాల్పులు జరిపారు. అనంతరం ఎన్‌కౌంటర్ దాదాపు 3-4గంటలపాటు కొనసాగినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ప్రాంతంలో ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పటివరకూ ముగ్గురు హతమయ్యారని.. వారంతా లష్కరే తోయిబాకు చెందినవారని పేర్కొన్నారు.
Also Read: