ఢిల్లీ ఆసుపత్రి నుంచి పరార్, నచ్చిన హాస్పిటల్స్ లోకి జంప్, హస్తినలో కోవిడ్ 19 రోగుల ‘దాగుడు మూతలు’, అధికారుల పరేషాన్ !
ఢిల్లీలోని హిందూరావు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 23 మంది కోవిడ్ 19 రోగులు ఇటీవల కనబడకుండా పోయారు. వీరి మెడికల్ రికార్డులు, ఫైళ్లు ఈ హాస్పిటల్ లో భద్రంగా ఉన్నా...
ఢిల్లీలోని హిందూరావు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 23 మంది కోవిడ్ 19 రోగులు ఇటీవల కనబడకుండా పోయారు. వీరి మెడికల్ రికార్డులు, ఫైళ్లు ఈ హాస్పిటల్ లో భద్రంగా ఉన్నా..వీరు మాత్రం మిస్సయ్యారు. అయితే ఆశ్చర్యంగా నగరంలోని కొన్ని ఇతర ఆసుపత్రుల్లో ఈ రోగులు చికిత్స పొందుతున్నారనో , లేదా హోంఐసోలేషన్ లో ఉన్నారనో తెలిసి హిందూరావు ఆసుపత్రి అధికారులు అవాక్కయ్యారు. ఈ 23 మందిలో 19 మందిని ఎమర్జెన్సీ నుంచి సాధారణ వార్డుల్లోకి షిఫ్ట్ చేయకముందే పరారయ్యారు. మిగతా నలుగురు రోగులను డిశ్చార్జ్ చేసినప్పటికీ రిపోర్టింగ్ లో జరిగిన పొరబాట్ల కారణంగా వీరిని పరారైనవారిగానే పరిగణిస్తున్నామని నార్త్ ఢిల్లీ మేయర్ జైప్రకాష్ తెలిపారు. పత్తా లేకుండా పోయినవారు నగరంలోని వివిధ హాస్పటల్స్ లో చికిత్స పొందారని, ఆ తరువాత కోలుకున్నారని తెలిసిందని ఆయన చెప్పారు. హిందూరావు ఆసుపత్రిలో అడ్మిషన్ కోసం వచ్చిన రోగులు ఇదే సమయంలో తమకు అనువైనవిగా భావించిన ఇతర హాస్పిటల్స్ తో కాంటాక్ట్ లో ఉన్నట్టు తెలిసింది. ఏప్రిల్ 19-మే 6 తేదీల మధ్య తాము చేరిన ఈ ఆసుపత్రి నుంచి సిబ్బందికి ఏమాత్రం తెలియజేయకుండా వీరంతా జారుకున్నారని సమాచారం. హిందూరావు ఆసుపత్రిని నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తోంది.
ఈ హాస్పిటల్ నుంచి 23 మంది రోగుల పరారీని ఢిల్లీ ప్రభుత్వం సీరియస్ గా పరిగణించింది. దీనిపై దర్యాప్తు జరపాలని డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆదేశించారు. అసలే నగరంలో కోవిడ్ కేసులు అత్యధికంగా ఉన్న ఈ సమయంలో ఒక ఆసుపత్రి నుంచి రోగులు మిస్సవడం దారుణమని ఆయన అన్నారు..
మరిన్ని చదవండి ఇక్కడ :Viral Video : క్రికెట్ బ్యాటింగ్‌తో అదరగొట్టిన ఏనుగు ! ఐపీల్ రద్దు అందుకే నేను వచ్చాను.. వైరల్ అవుతున్న వీడియో
Viral Video :ఏలియన్స్ నన్ను కిడ్నప్ చేసాయి..!అంటూ లేడి షేర్ చేసిన వీడియో వైరల్..