Covid-19 Vaccination: కరోనా కల్లోలానికి వ్యాక్సి్న్‌తోనే కట్టడి.. టీకా తీసుకునేందుకు మొగ్గుచూపుతున్న యువత

కరోనా కట్టడిలో భాగంగా ప్రజల మధ్య భౌతిక దూరం పెంచడంతో పాటు, వ్యాక్సినేషన్ ప్రక్రియ ముఖ్యమని సైంటిస్టులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ ప్రక్రియను వేగవంతం చేసింది కేంద్రప్రభుత్వం.

Covid-19 Vaccination: కరోనా కల్లోలానికి వ్యాక్సి్న్‌తోనే కట్టడి.. టీకా తీసుకునేందుకు మొగ్గుచూపుతున్న యువత
Youth Interest To Take Vaccine
Follow us
Balaraju Goud

|

Updated on: May 11, 2021 | 2:40 PM

Covid-19 Vaccination Drive: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కరాళ నృత్యాన్ని కొనసాగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా బారిన పడి కన్నుమూసిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. పాజిటివ్ కేసులు గంటగంటకూ రాకెట్లా దూసుకెళ్తున్నాయి. అనేక దేశాల్లో పాజిటివ్ కేసులు.. దానికి అనుగుణంగా మరణాలు బెంబేలెత్తిస్తున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడంలో, మరణాలకు అడ్డుకట్ట వేయడంలో అగ్రదేశాలు సైతం చేతులు ఎత్తేశాయి. ఇటు భారత దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ సెకండ్ వేవ్ విరుచుకుపడుతోంది.

అయితే కరోనా కట్టడిలో భాగంగా ప్రజల మధ్య భౌతిక దూరం పెంచడంతో పాటు, వ్యాక్సినేషన్ ప్రక్రియ ముఖ్యమని సైంటిస్టులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ ప్రక్రియను ప్రారంభించింది కేంద్రప్రభుత్వం. మొదటి దశలో ఫ్రంట్ లైన్ వారియర్స్ వైద్య సిబ్బందికి కోవిడ్ టీకా అందించిన ప్రభుత్వం.. రెండోవిడతలో 45 ఏళ్లు పైబడిన వారందరికీ అందించింది. వ్యాక్సినేషన్‌తో కరోనా నియంత్రణలోకి వస్తుండటంతో మూడో దశను ప్రారంభించింది కేంద్రప్రభుత్వం.

Covid Vaccine

Covid Vaccine

మూడో దశలో భాగంగా మే నెల 1 నుంచి దేశంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ కోవిడ్-19 వ్యాక్సీన్ ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మూడో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియ విస్తృత స్థాయిలో అందరికీ వర్తించేలా ఉంటుందని కేంద్ర ఆరోగ్య – కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. కరోనా వైరస్ ఉరుముతున్న తరుణంలో టీకా మినహా మార్గం లేదంటున్నారు శాస్త్రవేత్తలు. కేంద్ర ప్రభుత్వం కూడా అదే మాట చెబుతోంది. కానీ అనుకున్న లక్ష్యం చేరుకునేదెలా? వ్యాక్సిన్‌ నిల్వలు వేగంగా తరిగిపోతున్న పరిస్థితి ఒకవైపు ఆందోళన కలిగిస్తుంటే.. డిమాండ్ – ఉత్పత్తి మధ్య లోటు ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. అయితే, లాక్ డౌన్ లు అమ‌ల్లో ఉన్నా ప్రజ‌లు వ్యాక్సిన్ వేసుకునేందుకు వెన‌కాడ‌రాద‌ని, వ్యాక్సినేష‌న్ డ్యూటీలో ఉన్న ఆరోగ్య సిబ్బందిని వేరే విధుల‌కు మ‌ళ్లించ‌రాద‌ని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

మూడో దశ వ్యాక్సినేషన్ వ్యూహంలో భాగంగా దేశంలోని వ్యాక్సీన్ ఉత్పత్తిదారులు కేంద్ర ఔషధ ప్రయోగశాల విడుదల చేసిన డోసుల్లో 50 శాతాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది. మిగతా 50 శాతం డోసులను వారు రాష్ట్ర ప్రభుత్వాలకు, ఓపెన్ మార్కెట్‌కు ఇవ్వొచ్చని ప్రభుత్వం ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం తనకు లభించిన వాటాలోని టీకాల డోసులను రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేటాయిస్తుంది. ఈ కేటాయింపులు ఆయా రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తి తీవ్రతను ఆధారంగా చేసుకుని నిర్ణయిస్తారు. అయితే, పూర్తిగా వినియోగానికి సిద్ధంగా దిగుమతి అయిన టీకాలను ప్రభుత్వేతర మార్గాలలో ఉపయోగిస్తారని కేంద్రం ప్రకటించింది.

వ్యాక్సినేషన్ పట్ల ప్రజల్లో అవగాహన పెంచాలని, వీలైనంత మంది టీకాలు వేయించుకునేలా ప్రోత్సహించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం కోవిడ్ ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో విస్తరిస్తోంది. పెద్ద నగరాల్లోని డాక్టర్లందరూ పట్టణాల వైద్యులతో అనుసంధానమైన పని చేయాల్సిన అవసరం ఉంది. కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించేలా ఆన్ లైన్ కన్సల్టేషన్స్ కొనసాగించేలా ప్రయత్నించాలని కేంద్ర ప్రభుత్వం సైతం చెబుతోంది.

కరోనా మొదటి డోసు తీసుకున్న వ్యక్తి వైరస్ బారినపడితే… రెండో డోసును లైట్ తీసుకోవద్దని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తప్పనిసరిగా రెండో డోసు కూడా తీసుకోవాల్సిందేనని… అయితే కరోనా నుంచి కోలుకున్న నాలుగు నుంచి ఎనిమిది వారాల తర్వాతే ఆ డోసును తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 18 ఏళ్లు పైబడిన వారందరికీ మే 1 నుంచి వ్యాక్సిన్ అందిస్తున్నారు. దేశంలో ఎక్కువ మంది యువతే ఉన్నందున ఇదే అతి పెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ కానుంది. వ్యాక్సినేషన్ కోసం ఇప్పటికే కోవిన్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. చాలా మంది యువత ఎగబడడంతో మొదట సాంకేతిక సమస్యలు వచ్చాయి. సర్వర్ డౌన్ అయింది. ఐనప్పటికీ చితి చాలా మంది యువత రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కేవలం 3 గంటల్లో 80లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వ్యాక్సిన్ వేసుకునేందుకు యువత ముందుకు రావడంతో భారీ స్థాయిలో రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి.

మరోవైపు భారత్‌లో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. కొత్తగా 3,29,942 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 2,29,92,517కి చేరింది. కొత్తగా 3,876 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 2,49,992కి చేరింది. దేశంలో మరణాల రేటు 1.1 శాతంగా ఉంది. ప్రపంచ దేశాల్లో ఇది 2.08 శాతంగా ఉంది. ఇండియాలో తాజాగా 3,56,082 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 1,90,27,304కి చేరింది. రికవరీ రేటు 82.8 శాతంగా ఉంది. రికవరీ రేటు పెరుగుతుండటం మంచి విషయం. ప్రస్తుతం భారత్‌లో 37,15,221 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా నిన్న 18,50,110 టెస్టులు మాత్రమే చేశారు. భారత్‌లో ఇప్పటివరకు 30 కోట్ల 56 లక్షల 00వేల 187 టెస్టులు చేశారు. కొత్తగా 25,03,756 మందికి వ్యాక్సిన్లు వేశారు. ఇప్పటివరకు 17కోట్ల 27లక్షల 10వేల 066మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.

కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఇంటెలిజెన్స్‌ నెట్‌వర్క్‌ (కొవిన్‌) అనేది ప్రపంచంలో మొట్టమొదటి డిజిటల్ ఎండ్ టు ఎండ్ టీకా పంపిణీ నిర్వహణ వ్యవస్థ. ఇందులో లబ్ధిదారుల పేర్లు నమోదు, ప్రామాణీకరణ, ధ్రువీకరణ పత్రాలు, షెషన్ కేటాయింపు, ఎఈఎఫ్ఐ, సర్టిఫికెట్ జనరేషన్, డ్యాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితర విషయాలన్ని ఉంటాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే ఆ సమాచారాన్ని లబ్ధిదారునికి ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేస్తుంది.

2020 డిసెంబర్ నాటికి ప్రపంచ వ్యాప్తంగా 250కి పైగా టీకాలు పరిశోధనా దశలో ఉన్నాయి. పెద్దఎత్తున రీసెర్చ్ వర్క్ జరుగుతోంది. పంపిణీకి కొత్త పద్దతులు కూడా అభివృద్ధి చేస్తున్నారు. ముక్కులో స్ప్రే చేసే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే బహుశా అదే ఎక్కువ ఆశాజనకంగా ఉంటుంది. ఇది వైరస్ ముక్కు ద్వారా వ్యాపించకుండా అడ్డుకుంటుంది. అయితే ఇది ఇంకా ప్రయోగ దశల్లోనే ఉంది. ఇది అందుబాటులోకి రావడానికి ఇంకా చాల సమయం పడుతుంది. అత్యధికమంది ప్రజలకు వైరస్ సోకడమో లేదా వ్యాక్సిన్ అందరూ వేయించుకోవడం జరిగిన తర్వాతే ఇది సాధ్యం కావచ్చు. అంటే అప్పుడు మాత్రమే హర్డ్ ఇమ్యూనిటీ వచ్చినట్టు లెక్క.

దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరగడానికి తోడు యువతలో అవగాహన కారణంగా వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుకు వస్తున్నారు. అలాగే వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తి వైరస్‌ వృద్ధి చేయలేరు. కానీ, ఇతరులకు వ్యాప్తి చేయవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ మాస్కును ధరించడం కొనసాగించండి. భౌతిక దూరం పాటించండి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవడాన్ని కొనసాగించండి. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలన్న లక్ష్యంతో టీవీ9 తమ వంతు ప్రయత్నం చేస్తోంది. ప్రతి ఒక్కరూ కోవిడ్ టీకా తీసుకుని తమ ప్రాణాలను కాపాడుకుంటూ, ఇతర ప్రాణాలను కాపాడాలని కోరుకుంటున్నాం.

Coronavirus

Coronavirus

ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..