దావత్ అంటే బిర్యానీ.. బిర్యానీ అంటే హైదరాబాద్..!

Phani CH

26 December 2024

హైదరాబాదీలు బిర్యానీ ప్రియులని మరోసారి తేలిపోయింది. 2024లో హైదరాబాద్‌లో స్వగ్గీలో ప్రతి నిమిషానికి 34 బిర్యానీ ఆర్డర్లు ఇచ్చారు. 

హైదరాబాద్‌లో ఏడాదిలో దేశంలోనే అత్యధికంగా ఏకంగా 1.57 కోట్ల బిర్యానీ ఆర్డర్లు ఇచ్చారు. 

హైదరాబాద్ ఆహార ప్రియులు అత్యధికంగా చికెన్ బిర్యానీనే లాగించేస్తున్నట్లు స్విగ్గీ గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. హైదరాబాద్‌లో వచ్చిన ఆర్డర్లలో 97.21 లక్షల ఆర్డర్లు చికెన్ బిర్యానీ కోసమే వచ్చాయి. 

హైదరాబాద్‌లో ప్రతి నిమిషానికి 21 చికెన్ బిర్యానీ ఆర్డర్లు అందినట్లు స్విగ్గీ తెలిపింది. మరీ ముఖ్యంగా ఇండియా క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతున్నప్పుడు బిర్యానీ ఆర్డర్లు ఎక్కువగా నమోదయ్యాయి. 

బిర్యానీ ఆర్డర్లలో హైదరాబాద్ తర్వాత 77 లక్షల ఆర్డర్లతో బెంగుళూరు రెండో స్థానం.. 46 లక్షల ఆర్డర్లతో చెన్నై మూడో స్థానంలో నిలుస్తోంది. 

దేశ వ్యాప్తంగానూ వరుసగా 9వ సంవత్సరం ఆన్‌లైన్ ఆర్డర్లలో బిర్యానీదే అగ్రస్థానం. 2024లో నవంబర్ 22 వరకు స్విగ్గీలో ఏకంగా 8.3 కోట్ల బిర్యానీ ఆర్డర్లు అందగా.. ఇందులో 4.9 లక్షల చికెన్ బిర్యారీ ఆర్డర్లున్నాయి. 

దేశ వ్యాప్తంగా స్విగ్గీలో ప్రతి నిమిషానికి 158 బిర్యానీ ఆర్డర్లు అందాయి. అంటే ప్రతి సెకనుకు 2 బిర్యానీ ఆర్డర్లు వస్తున్నాయి. 

బిర్యానీ తర్వాత దోస 2.3 కోట్ల ఆర్డర్లతో రెండో స్థానంలో నిలిచింది. దేశంలోనే అత్యధికంగా బెంగుళూరులో ఏకంగా 22 లక్షల దోస ఆర్డర్లు చేశారు.