ప్రెసెంట్ యూత్ కు అమృత అయ్యర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. తన హాట్ అందాలను సోషల్ మీడియా లో షేర్ చేస్తున్న అందరిని తనవైపు తిప్పుకుంటుంది.
అమృత అయ్యర్ కర్ణాటక రాష్ట్రం, బెంగూళూరులో 14 మే 1994న జన్మించింది. ఆమె బెంగూళూరులోని సెయింట్ జోసఫ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ లో బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ పూర్తి చేసింది.
అమృత అయ్యర్ 2012లో మలయాళంలో విడుదలైన ‘పద్మవ్యూహాం’ సినిమాలో తొలిసారి ఓ చిన్నపాత్రలో నటించి సినీరంగంలోకి అడుగుపెట్టిది.
ఆ తరువాత 2018లో తమిళంలో ‘పదైవీరన్’ అనే సినిమా ద్వారా హీరోయిన్‌గా పరిచమై మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ చిన్నది.
కోలీవుడ్ స్టార్ హీరో 'దళపతి' విజయ్ నటించిన 'బిగిల్' సినిమాతో పాపులర్ అయింది నటి అమృత అయ్యర్. తరువాత హీరో రామ్ పోతినేని నటించిన 'రెడ్' సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.
ఆ తరువాత '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' 'అర్జున ఫాల్గుణ' వంటి సినిమాల్లో నటించి తరువాత పాన్ ఇండియా సినిమా హనుమాన్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ప్రస్తుతం అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న బచ్చలమల్లి సినిమాలో నటించి మరొకసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది ఈ చిన్నది.