వ్యాక్సిన్ మొదటి డోసు వేసుకున్నాకా కరోనా సోకిందా ? అయితే రెండవ డోస్ తిరిగి ఎప్పుడు వేసుకోవాలో తెలుసా ?
Corona Vaccine: దేశంలో కరోనా రెండో దశ విలయతాండవం చేస్తుంది. రోజూకీ నాలుగు లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతుండగా..
Corona Vaccine: దేశంలో కరోనా రెండో దశ విలయతాండవం చేస్తుంది. రోజూకీ నాలుగు లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతుండగా.. వేల సంఖ్యలో కోవిడ్ బాధితులు మృతిచెందుతున్నారు. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతుంది. అయితే టీకా తీసుకున్నా తర్వాత కూడా కోవిడ్ సోకే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు సూచించిన సంగతి తెలిసిందే. కానీ టీకా తీసుకున్న తర్వాత కరోనా ప్రభావం కాస్త తక్కువగా ఉంటుందని..దీంతో రికవరీ రేటు పెరిగే అవకాశం ఉంటుంది. అయితే చాలా మందిలో మొదటి టీకా డోసు వేసుకున్న తర్వాత కోవిడ్ బారిన పడితే రెండవ డోసు తీసుకోవచ్చా? తీసుకుంటే ఎన్ని రోజుల తర్వాత తీసుకోవాలి ? కరోనా సోకిన తర్వాత తీసుకోవచ్చా ? లేదా కొన్ని రోజుల తర్వాత తీసుకోవాలా ? అనే సందేహాలు చాలా మందిలో వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు టీకా తీసుకున్న తర్వాత కరోనా బారిన పడిన కేసులు సంఖ్య రేటు 0.05 శాతం కంటే తక్కువగా ఉందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్ ) తెలిపింది.
టీకా మొదటి డోసు తీసుకున్న తర్వాత కరోనా సోకితే రెండవ డోసు తీసుకోకుడనే రూల్ ఏం లేదు. కానీ టీకా రెండవ డోసు కోలుకున్న తర్వాత కనీసం నాలుగు నుంచి ఎనిమిది వారాల వరకు తీసుకోకుడదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. రెండవ డోసును నాలుగు నుంచి ఎనిమిది వారాల వాయిదా కాలం తప్పనిసరి. కోవిడ్ లక్షణాలు స్వల్పంగా ఉన్న వ్యక్తులు, కోవిడ్ మోనోక్లోనల్ యాంటీబాడీస్ లేదా ప్లాస్మా పొందిన రోగులు, ఇతర అనారోగ్యంతో బాధపడుతున్న ఆసుపత్రిలో చేరిన రోగులకు ఈ నియమం వర్తిస్తుంది.
సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ప్రకారం హోం ఐసోలేషన్ లో ఉండటాన్ని నిలిపివేసే ప్రమాణాలకు అనుగుణంగా… లక్షణాలు లేని వారు టీకా రెండవ డోసు తీసుకోవచ్చు. అలాగే మారుతున్న లక్షణాలు, షెడ్యూల్, వ్యాక్సిన్ సరిగ్గా నిల్వ చేయడం.. నిర్వహించడం వంటి ప్రోగ్రామిక్ కారకాలతో సహ వాస్తవ ప్రపంచ పరిస్థితులలో టీకా ఎలా పనిచేస్తుందో అని ప్రభావితం చేసే అనేక అంశాలున్నాయని సీడీసీ పేర్కొంది.
ట్వీట్..
?When can I get my 2nd dose of #vaccine if I get infected after the 1st does?
➡️ Have a look to this video?#Unite2FightCorona@PMOIndia @drharshvardhan @IndiaDST @PrakashJavdekar @MoHFW_INDIA @mygovindia @PIB_India @WHO @ICMRDELHI
Via @IndiaScienceTV pic.twitter.com/E1Dx45rvLg
— #IndiaFightsCorona (@COVIDNewsByMIB) May 7, 2021
Also Read: India Coronavirus: కరోనా సెకండ్ వేవ్.. నిన్న కాస్త తగ్గిన కరోనా కేసులు.. మరణాలు ఎన్నంటే..?