Vaccinate All: వ్యాక్సినేషన్ సవాల్.. కేంద్రం ముందు పెద్ద టాస్క్.. జూలై నాటికి 30 కోట్ల మందికి టీకా సాధ్యమేనా.!

Vaccinate All Vaccinate Now: కరోనా పేరు వింటేనే చాలు ప్రజలు భయందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఏ దుర్వార్త వినాల్సి వస్తుందో తెలియని పరిస్థితి..

Vaccinate All: వ్యాక్సినేషన్ సవాల్.. కేంద్రం ముందు పెద్ద టాస్క్.. జూలై నాటికి 30 కోట్ల మందికి టీకా సాధ్యమేనా.!
Follow us
Ravi Kiran

|

Updated on: May 11, 2021 | 11:57 AM

Vaccinate All Vaccinate Now: కరోనా పేరు వింటేనే చాలు ప్రజలు భయందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఏ దుర్వార్త వినాల్సి వస్తుందో తెలియని పరిస్థితి. ఈ సమయంలో వ్యాక్సిన్ ఇప్పుడు కోవిడ్‌కు వ్యతిరేకంగా ఓ కవచంలా పని చేస్తోంది. కరోనా నుంచి మనల్ని కాపాడగలిగేది టీకా ఒక్కటే. ఎందుకంటే ప్రపంచం మొత్తం ఎక్కువ కాలం సంపూర్ణ లాక్‌డౌన్ లేదా పాక్షిక లాక్‌డౌన్‌లో ఉండలేదు. ఒకవేళ అదే జరిగితే ఎంతోమంది ఆకలి చావులతో పరిస్థితులు అల్లకల్లోలం అయిపోతాయి. అందుకే కరోనాపై పోరులో భాగంగా ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సినేషన్ చేయించుకోవాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి.

ప్రస్తుతం ప్రపంచం నలుమూలల కోవిడ్ ఫ్రీ దేశం అంటూ ఏదీ లేదు. కరోనా నుంచి విముక్తి పొందామని అనుకునేలోపే మరోసారి మహమ్మారి ఆయా దేశాల్లో విజృంభిస్తోంది. రెండవ వేవ్ విజృంభణ మొదలు కాకముందు భారతదేశం కూడా కోవిడ్ ఫ్రీ అని భావించింది. కానీ శాస్త్రవేత్తలు, పరిశోధకులు కరోనాపై హెచ్చరికలు జారీ చేశారు. కరోనాకు అంతం లేదని.. చాలా సంవత్సరాలు ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ వేవ్‌లు వ్యాప్తి చెందే అవకాశం ఉందని అంటున్నారు. అంటే పేద దేశాల పౌరులకు టీకాలు వేసే వరకు తమ జనాభాకు టీకాలు వేయడానికి ముందడుగు వేసిన ఆధునిక / ధనిక దేశాలు కూడా సురక్షితం కాదని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం భారతదేశంలో కరోనా సెకండ్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ నేపధ్యంలోనే కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగంగా కొనసాగిస్తోంది. జూలైలోగా ప్రయారిటీ బేసేస్‌లో 30 కోట్ల మంది భారతీయులకు వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకుంది. ఈ క్రమంలోనే 18 ఏళ్లు పైబడిన వారికి సైతం టీకా వేయడానికి అనుమతించిన విషయం విదితమే. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే కేంద్రం.. తాను అనుకున్న టార్గెట్‌ను ఇప్పటిలో రీచ్ అయ్యేలా కనిపించట్లేదు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగుతున్నా.. కొన్నింటిలో పలు సమస్యలు తలెత్తుతున్నాయి. అటు వ్యాక్సిన్ కొరత కూడా ఉండటంతో జూలైలోగా 30 కోట్ల మంది భారతీయులకు రెండు డోసుల వ్యాక్సిన్ వేయడం సాధ్యం కాదనే చెప్పాలి.

ఇప్పటిదాకా 30 కోట్ల మంది భారతీయుల్లో కేవలం 10 శాతం కంటే తక్కువ మంది రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారు. అంటే దాదాపు 3 కోట్ల(2,92,09,885) మందికి పూర్తిగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముగిసింది. ఇందులో 6,471,385 మంది ఆరోగ్య కార్యకర్తలు, 7,755,283 మంది ఫ్రంట్‌లైన్ కార్మికులు, 1,49,83,217 మంది సీనియర్ సిటిజన్లు ఉన్నారు. 45-60 ఏళ్లలోపు 65,61,851 మంది రెండు మోతాదుల టీకా పొందగా.. వారు ప్రాధాన్యత గ్రూప్‌లో లేరు. వీరిని కూడా పూర్తి వ్యాక్సినేషన్ తీసుకున్నవారి జాబితాలోకి తీసుకుంటే ఇప్పటిదాకా 3, 57, 71,736 మంది భారతీయులు రెండు డోసుల టీకా తీసుకున్నారు.

మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమయ్యి 114 రోజులు గడుస్తోంది. భారతదేశంలో ఇప్పటివరకు 17 కోట్ల టీకాలు వేసినట్లు సోమవారం కేంద్రం ట్వీట్ చేసింది. ఈ ఘనత చైనాకు 119 రోజులు పట్టగా.. అమెరికా 115 రోజులలో సాధించింది. భారత్ అయితే 114 రోజుల్లోనే ఈ ఘనత అందుకుంది. రాష్ట్రాల వద్ద 1 కోట్లకు పైగా వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని కేంద్రం చెబుతుండగా.. అన్ని చోట్లా వ్యాక్సిన్ కొరత మాత్రం తీవ్రంగా ఉందని స్పష్టం అవుతోంది.

Tv9

Tv9

దేశంలో సెకండ్ వేవ్ మరింత ప్రమాదకరంగా మారుతుండటం.. మరోవైపు వ్యాక్సినేషన్ నెమ్మదించడంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన మొదలైంది. ఇలాగే కొనసాగితే మరిన్ని వేవ్‌లు వచ్చే అవకాశం ఉందని ఫిచ్ రేటింగ్స్ హెచ్చరిస్తోంది. ”భారతదేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోందని.. ప్రస్తుతం మొత్తం జనాభాలో 2 శాతం కన్నా తక్కువ మందికి టీకాలు వేశారని.. త్వరత్వరగా వేగం పెంచాలని” ది లాన్సెట్ పేర్కొంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 18 ఏళ్లు పైబడిన 20 లక్షల మంది వ్యాక్సిన్ తీసుకున్నారని తెలుస్తోంది.

కాగా, ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో మరో మంచి పనికి నడుం బిగించింది టీవీ9. అందరికీ వ్యాక్సిన్‌.. అందరికీ ఆరోగ్యం అనే నినాదంతో.. వ్యాక్సిన్ ప్రతీ ఒక్కరికే అందాలనే సంకల్పంతో ముమ్మరంగా టీవీ 9 ప్రచారాన్ని ప్రారంభించింది. ‘Vaccinate All, Vaccinate Now’ అనే స్లోగన్‌తో అందరికీ వ్యాక్సిన్‌.. అందరికీ ఆరోగ్యమంటోంది టీవీ9. ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తు చేస్తోంది. వ్యాక్సినేషన్‌కు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు మీ ముందుంచుతోంది టీవీ9.

Also Read:

హోం ఐసోలేషన్‌లో ఉన్న కరోనా బాధితులు.. ఏం చేయాలి.? ఏం చేయకూడదు.?

ఐపీఎల్ వాయిదా.. పలు ఫ్రాంచైజీలకు లాభం.. ఆ ఐదుగురు ప్లేయర్ల పునరాగమనం.!

Viral Video: ద్యావుడా.. బైక్‌పై ఇలా కూడా వెళ్తారా.. నవ్వు తెప్పిస్తున్న వీడియో..!

భారీ నాగపామును పట్టి బరాబరా ఈడ్చుకెళ్లిన బామ్మ.. నెటిజన్లు ఫిదా.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో.!

తక్కువ ధరతో కొత్త టీమ్‌లోకి కృనాల్ పాండ్యా.. పూర్తి వివరాలు
తక్కువ ధరతో కొత్త టీమ్‌లోకి కృనాల్ పాండ్యా.. పూర్తి వివరాలు
Allah Ghazanfar: ఆఫ్ఘాన్ ప్లేయర్‌కు ఊహించని ప్రైజ్ అందించిన ముంబై
Allah Ghazanfar: ఆఫ్ఘాన్ ప్లేయర్‌కు ఊహించని ప్రైజ్ అందించిన ముంబై
పిల్లల్లో పెరుగుతోన్న మయోపియా సమస్య.. ఇంతకీ ఏంటిది.?
పిల్లల్లో పెరుగుతోన్న మయోపియా సమస్య.. ఇంతకీ ఏంటిది.?
95 మంది ప్రయాణికులతో వెళ్తు్న విమానంలో మంటలు.. ఆ భయానక దృశ్యాలు
95 మంది ప్రయాణికులతో వెళ్తు్న విమానంలో మంటలు.. ఆ భయానక దృశ్యాలు
ఒకప్పుడు ఐపీఎల్ హిస్టరీలోనే కాస్ట్లీ పేయర్.. కట్ చేస్తే
ఒకప్పుడు ఐపీఎల్ హిస్టరీలోనే కాస్ట్లీ పేయర్.. కట్ చేస్తే
Bhuvneshwar Kumar: కావ్యాపాప వద్దంది.. కాసుల వర్షం కురిపించిన RCB
Bhuvneshwar Kumar: కావ్యాపాప వద్దంది.. కాసుల వర్షం కురిపించిన RCB
దశాబ్దంలోనే తారుమారైంది.. దూసుకెళ్తున్న భారత ఆర్థిక వ్యవస్థ
దశాబ్దంలోనే తారుమారైంది.. దూసుకెళ్తున్న భారత ఆర్థిక వ్యవస్థ
ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీకి ప్రభుత్వం ప్రోత్సాహం
ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీకి ప్రభుత్వం ప్రోత్సాహం
విటమిన్-డి తగినంత అందాలంటే ఎప్పుడు, ఎంతసేపు ఎండలో ఉండాలో తెలుసా?
విటమిన్-డి తగినంత అందాలంటే ఎప్పుడు, ఎంతసేపు ఎండలో ఉండాలో తెలుసా?
రూ. 5 ఎక్కువ వసూలు చేసినందుకు.. రూ. లక్ష జరిమానా.. వైరల్‌ వీడియో
రూ. 5 ఎక్కువ వసూలు చేసినందుకు.. రూ. లక్ష జరిమానా.. వైరల్‌ వీడియో
రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!