Fact Check: సముద్రంలో అలల బీభత్సం.. వంతెన కూలుతున్న వీడియో వైరల్ వెనుక అసలు వాస్తవం ఏమిటంటే..
బిపర్‌జోయ్ తుపాను తీరాన్ని తాకడంతో కచ్ తీరం నుంచి పాకిస్తాన్ లోని కరాచీ తీరం వరకూ సముద్రంలోని అలలు భారీగా ఎగసి పడుతున్నాయి. సోషల్ మీడియాలో ఒక వీడియో తుఫాన్ సృష్టించిన భీభత్సం అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే వైరల్ అవుతున్న వీడియో గురించి వాస్తవం ఏమిటంటే.. .
అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్‌జోయ్ తుపాను గుజరాత్ లోని కచ్ జిల్లాలో జఖౌ తీరాన్ని తాకింది. ఓ వైపు తుఫాన్ వేగం మందగించి గుజరాత్ లోని జఖౌ, మాండ్వీ సహా కచ్, సౌరాష్ట్రలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పెను గాలులతో విధ్వంసం సృష్టిస్తోంది. మరోవైపు బిపర్‌జోయ్ తుపాను తీరాన్ని తాకడంతో కచ్ తీరం నుంచి పాకిస్తాన్ లోని కరాచీ తీరం వరకూ సముద్రంలోని అలలు భారీగా ఎగసి పడుతున్నాయి. సోషల్ మీడియాలో ఒక వీడియో తుఫాన్ సృష్టించిన భీభత్సం అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పటికే ఈ వీడియో నెట్టింట్లో చక్కలు కొడుతూ భారీ స్పందనను సొంతం చేసుకుంది. అయితే వైరల్ అవుతున్న వీడియో గురించి వాస్తవం ఏమిటంటే..
ఈ వీడియో ఇప్పటిది కాదు.. అంటే గుజరాత్ లో నానా బీభత్సం సృష్టించిన బిపర్‌జోయ్ తుపాను కు సంబంధించినది కాదని తెలుస్తోంది. ఇంకా చెప్పాలంటే అసలు వైరల్ అవుతున్న ఈ వీడియో కొన్ని ఏళ్ల క్రితంది.. అంటే.. ఆగస్ట్ 2017 నాటిదిగా తెలుస్తోంది. అప్పట్లో ఓఖీ తుఫాను లక్షద్వీప్‌లోని మినికాయ్ ద్వీపాన్ని తీరం తాకిన సందర్భంలో సముద్రం అలలు ఎగసి పడినట్లు తెలుస్తోంది. అప్పటి వీడియో మళ్ళీ బిపర్‌జోయ్ తుపాను బీభత్సం అంటూ నెట్టింట్లో చక్కర్లు కొట్టిస్తున్నారు కొందరు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..