Facebook: సమాచారం ఇవ్వకుంటే ఇండియాలో ఫేస్‌బుక్‌ని నిలిపేస్తాం.. స్ట్రాంగ్‌ వార్నింగ్ ఇచ్చిన హైకోర్ట్‌

అడిగిన సమాచారం ఇవ్వకపోతే భారత్‌లో ఫేస్‌బుక్‌ సేవలను నిలిపివేయాల్సి ఉంటుందని కర్ణాటక హైకోర్టు గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఓ కేసు విచారణ సందర్భంగా హైకోర్ట్‌ ఈ వ్యాఖ్యలు చేసింది. కేసు విచారణ నిమిత్తం ఫేస్‌బుక్‌ అడిగిన సమాచారం ఇవ్వకపోతే సేవలను నిలిపివేస్తామని హెచ్చరించింది. వివరాల్లోకి వెళితే..

Facebook: సమాచారం ఇవ్వకుంటే ఇండియాలో ఫేస్‌బుక్‌ని నిలిపేస్తాం.. స్ట్రాంగ్‌ వార్నింగ్ ఇచ్చిన హైకోర్ట్‌
Facebook
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 16, 2023 | 6:39 AM

అడిగిన సమాచారం ఇవ్వకపోతే భారత్‌లో ఫేస్‌బుక్‌ సేవలను నిలిపివేయాల్సి ఉంటుందని కర్ణాటక హైకోర్టు గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఓ కేసు విచారణ సందర్భంగా హైకోర్ట్‌ ఈ వ్యాఖ్యలు చేసింది. కేసు విచారణ నిమిత్తం ఫేస్‌బుక్‌ అడిగిన సమాచారం ఇవ్వకపోతే సేవలను నిలిపివేస్తామని హెచ్చరించింది. వివరాల్లోకి వెళితే.. తాజాగా సౌదీ అరేబియా జైల్లో ఉన్న భారతీయ వ్యక్తికి సంబంధించిన కేసు విషయంలో హైకోర్ట్‌ ఈ వ్యాఖ్యలు చేసింది. స్థానిక పోలీసులకు సహకరించని కారణంగా ఈ మేరకు ఆదేశాలు జారీ చేస్తామని కోర్టు తెలిపింది.

అసలు విషయం ఏంటంటే.. సౌదీ అరేబియాలోని ఓ సంస్థలో పనిచేసే శైలేశ్‌ కుమార్‌ అనే వ్యక్తి 2019 ఏడాదిలో పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర రిజిస్టర్-ఎన్ఆర్ సీకి అనుకూలంగా ఓ పోస్ట్‌ చేశారు. అయితే ఆ తర్వాత శైలేశ్‌ పేరుతో ఎవరో వ్యక్తి నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాను ఓపెన్‌ చేశారు. అనంతరం ఆ ఖాతా నుంచి సౌదీ అరేబియా దేశంపై అభ్యంతకర పోస్టులు చేశారు. దీంతో స్పందించిన అక్కడి ప్రభుత్వం శైలేశ్‌ను అరెస్ట్ చేసింది. ఈ విషయమై ఆయన భార్య తాజాగా మంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ ప్రారంభించిన పోలీసులు తమకు అవసరమైన సమాచారం అందించాని ఫేస్‌బుక్‌కు లెటర్‌ రాశారు. అయితే ఫేస్‌బుక్‌ యాజమాన్యం నుంచి ఎలాంటి బదులు రాలేదు. విచారణ ఎంతకీ కొలిక్కి రాకపోవడంతో శైలేశ్‌ భార్య పోలీసులను ఆశ్రయించింది.

ఇందులో భాగంగానే విచారణ జరిపిన కర్నాటక హైకోర్టు.. కేసు విచారణకు అవసరమైన సమాచారంతో కూడిన పూర్తి నివేదికను వారం రోజుల్లో కోర్టుకు సమర్పించాలని ఫేస్ బుక్ యాజమాన్యాన్ని ఆదేశించింది. అడిగిన సమాచారం ఇవ్వకపోతే ఫేస్‌బుక్‌ను భారత్‌లో నిలిపివేస్తామని హెచ్చరించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు