Wildlife Protection: ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చాక వన్య ప్రాణుల సంరక్షణ ఇలా..
ప్రపంచంలోని చాలా దేశాల్లో వణ్యప్రాణుల సంఖ్య ప్రతి ఏటా తగ్గిపోతున్నాయి. అలాగే కొన్ని జాతుల జంతురాశి అంతరించిపోతుంది. దీనికి భారత్ కూడా మినహాయింపు కాదు. దేశంలో ఎన్నో జాతులు జంతురాశులు..
Wildlife Protection: ప్రపంచంలోని చాలా దేశాల్లో వన్య ప్రాణుల సంఖ్య ప్రతి ఏటా తగ్గిపోతున్నాయి. అలాగే కొన్ని జాతుల జంతురాశి అంతరించిపోతుంది. దీనికి భారత్ కూడా మినహాయింపు కాదు. దేశంలో ఎన్నో జాతులు జంతురాశులు అంతరిస్తూ వస్తున్న క్రమంలో.. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చాక వన్య ప్రాణుల సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. దీంతో సానుకూల ఫలితాలు వస్తున్నాయి. 2014 నుంచి కేంద్రప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా దేశంలో అటవీ విస్తీర్ణం పెరిగింది. వన్య ప్రాణుల సంరక్షణ ప్రాంత విస్తీర్ణం కూడా పెరిగింది. 2014లో దేశ భౌగోళిక ప్రాంతంలో వన్య ప్రాణుల సంరక్షణ ప్రాంతం 4.90% మాత్రమే ప్రస్తుతం వన్య ప్రాణుల రక్షిత ప్రాంతాల విస్తీర్ణం 5.03 శాతానికి పెరిగింది. 2014లో 1,61,081.62 చ.కి.మీ విస్తీర్ణంతో దేశంలోని 740 వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాలు ఉండగా.. ప్రస్తుతం 1,71,921 చ.కి.మీ విస్తీర్ణంలో వన్య ప్రాణుల సంరక్షణ కేంద్రాలు 981కు పెరిగాయి.
గత నాలుగేళ్లలో అడవులు, చెట్ల విస్తీర్ణం దేశంలో 16,000 చదరపు కిలోమీటర్ల మేర పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా అటవీ విస్తీర్ణం స్థిరంగా పెరుగుతున్న దేశాల్లో భారత్ ఒకటిగా ఉంది. కమ్యూనిటీ రిజర్వ్‌ల సంఖ్య కూడా 2014లో కేవలం 43 మాత్రమే రాగా.. 2019కి వాటి సంఖ్య వంద కంటే ఎక్కువకు పెరిగింది. దేశంలోని 18 రాష్ట్రాల్లో సుమారు 75,000 చ.కి.మీ విస్తీర్ణంలో 52 పులుల సంరక్షణ కేంద్రాలు ఉండగా.. పులుల సంరక్షణకు కేంద్రప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. దీనిలో భాగంగా పులుల సంరక్షణకు బడ్జెట్ కేటాయింపులను పెంచింది. 2014లో పులుల సంరక్షణకు బడ్జెట్ కేటాయింపులు రూ.185 కోట్లు కాగా.. 2022లో ఈకేటాయింపులు రూ.300 కోట్లకు పెరిగాయి.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 12,852 చిరుత పులులు ఉన్నాయి. 2014లో వీటి సంఖ్య కేవలం 7910 మాత్రమే.. ప్రస్తుతం చిరుత పులుల జనాభా 2014తో పోలిస్తే 60 శాతం ఎక్కువుగా ఉంది. మరోవైపు కేంద్రప్రభుత్వం వన్యప్రాణుల సంరక్షణకు తీసుకుంటున్న చర్యల కారణంగా.. చిరుత పులుల్లో ఒక రకమైన అరుదైన వన్య ప్రాణులు చీతాలు 74 సంవత్సరాల తర్వాత భారత్ లో అడుగుపెట్టాయి. నమీబియాలోని విండ్‌హాక్ నుంచి 8 చీతాలతో బయల్దేరిన ప్రత్యేక విమానం సెప్టెంబర్ 17వ తేదీ ఉదయం మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ల్యాండ్ అయ్యింది. కునో నేషనల్ పార్క్ లో ఈఅరుదైన జాతికి చెందిన చిరుతపులులను ఉంచారు. చీతాలు జాతికి చెందిన చిరుతపులులు అంతరించినట్లు 952లో భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో వన్యప్రాణుల సంరక్షకుల కృషి, కేంద్ర ప్రభుత్వ చొరవ ఫలితంగా ఇప్పుడు నమీబియా నుంచి 8 చీతాలును భారత్ కు తీసుకొచ్చారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..