PM Modi Birthday: దేశం కంటే ఆయనకు ఏదీ ఎక్కువ కాదు.. ప్రధాని మోదీపై నిర్మలా సీతారామన్ ప్రశంసలు..

PM Modi Birthday: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని సేవతో జరుపుకుంటున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్ అన్నారు.

PM Modi Birthday: దేశం కంటే ఆయనకు ఏదీ ఎక్కువ కాదు.. ప్రధాని మోదీపై నిర్మలా సీతారామన్ ప్రశంసలు..
Nirmala Sitharaman
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 17, 2022 | 11:58 AM

PM Modi Birthday: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని సేవతో జరుపుకుంటున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్ అన్నారు. శనివారం నాడు ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆమె.. ప్రతి బీజేపీ కార్యకర్త రక్తదానం చేయడమో, టీబీ రోగిని దత్తత తీసుకోబడమో చేస్తున్నామన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని ప్రతి ఒక్కరి ఆర్థిక, ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. దేశంలో ప్రతి పేదవాడిని జన్ ధన్ ఖాతాలతో బ్యాంకుల దగ్గరకు తీసుకొచ్చారన్నారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు పేదలకే నేరుగా అందేలా డీబీటీ అమలు చేస్తున్నారని చెప్పారు. గతంలో కేంద్రం రూ. 100 ఇస్తే.. రూ. 15 మాత్రమే లబ్దిదారుడికి చేరేదని, కానీ, ఇప్పుడు కేంద్రం ఎంత ఇస్తే అంత మొత్తం నేరుగా పేదవాడి ఖాతాకు చేరుతోందన్నారు. మోదీ ప్రధాని అయ్యాక పథకాల్లో లీకేజీ అన్నది లేకుండా అమలవుతున్నాయని చెప్పారు. ముద్ర స్కీం ద్వారా ఎలాంటి గ్యారంటీ లేకుండా చిరువ్యాపారులకు రుణాలు అందుతున్నాయని చెప్పారు కేంద్ర ఆర్థిక మంత్రి.

తాను పెరిగిన నర్సాపురంలో తన చిన్నతనంలో కూరగాయల వ్యాపారులు ఎన్ని కష్టాలు పడేవారో చూశానని, డైలీ ఫైనాన్స్ వ్యవస్థ నుంచి రూ. 100 రుణంగా తీసుకుంటే రూ. 90 మాత్రమే ఇచ్చేవారని గుర్తు చేసుకున్నారు. మళ్లీ సాయంత్రం వ్యాపారం ముగించుకుని తిరిగి చెల్లించేటప్పుడు రూ. 100 చెల్లించాల్సి వచ్చేదన్నారు. ఈ తరహాలో రోజువారీ దోపిడీకి చిరు వ్యాపారులు గురయ్యేవారన్నారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి దేశంలో ఎక్కడా లేదన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థ అందరికీ అందుబాటులోకి వచ్చిందని, ప్రతీ కుటుంబానికి సొంతిల్లు అందించాలన్నది ప్రధాని మోదీ తాపత్రయం అని పేర్కొన్నారు. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో కేంద్రం ఇళ్లను మంజూరు చేసిందని గుర్తు చేశారు. నేషన్ ఫస్ట్ అన్న విధానంతో ప్రధాని మోదీ పని చేస్తున్నారని తెలిపారు. దేశం కంటే ఆయనుకు ఏదీ ఎక్కువ కాదని, అలాంటి వ్యక్తి సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నానని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆకాంక్షించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్