AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Data Theft Case: డేటా చోరీ వ్యవహారంలో కీలక పరిణామం.. కేసు నమోదు చేసిన ఈడీ..

డేటా చోరీ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. గత వారం వెలుగు చూసిన డేటా చోరీ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.. ఒక్కరు కారు ఇద్దరు కాదు ఏకంగా 17 కోట్ల మందికి సంబంధించిన డేటా సైబర్‌ నేరగాళ్ల చేతికి చిక్కింది. ఫోన్‌ నెంబర్‌, ఆధార్‌, ప్యాన్, మొబైల్‌ నెంబర్స్ సహ 18 రకాల వ్యక్తిగత సమాచారం సైబర్‌ నేరగాళ్లకు అందినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

Data Theft Case: డేటా చోరీ వ్యవహారంలో కీలక పరిణామం.. కేసు నమోదు చేసిన ఈడీ..
Data Theft Case
Shaik Madar Saheb
|

Updated on: Mar 30, 2023 | 2:01 PM

Share

డేటా చోరీ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. గత వారం వెలుగు చూసిన డేటా చోరీ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.. ఒక్కరు కారు ఇద్దరు కాదు ఏకంగా 17 కోట్ల మందికి సంబంధించిన డేటా సైబర్‌ నేరగాళ్ల చేతికి చిక్కింది. ఫోన్‌ నెంబర్‌, ఆధార్‌, ప్యాన్, మొబైల్‌ నెంబర్స్ సహ 18 రకాల వ్యక్తిగత సమాచారం సైబర్‌ నేరగాళ్లకు అందినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందులో రక్షణ విభాగంలో పనిచేసే ఉద్యోగులు, ప్రభుత్వ సంస్థలు, ముఖ్యమైన సంస్థలకు చెందిన రహస్య సమాచారమంతా చోరికి గురైనట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. దేశ పౌరుల భద్రతకు సంబంధించిన సున్నితమైన వ్యవహారం కావడంతో ఈ విషయాన్ని కేంద్రం కూడా సీరియస్‌గా తీసుకుంది. ఇందులో ఉగ్రకోణం ఏమైనా ఉందా అనే కోణంలోనూ ఇప్పుడు దర్యాప్తు సాగనుంది. ఈ కేసులోకి ఇప్పుడు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కూడా ప్రవేశించింది. సైబరాబాద్‌ పోలీసులు ఫైల్‌ చేసిన FIR ఆధారంగా ED ఇప్పుడు కేసు నమోదు చేసింది. అత్యంత కఠినమైన PMLA చట్టం కింద ఈ కేసును ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నమోదు చేసింది. కేసు తీవ్రతను దృష్టిలో పెట్టుకొని డిఫెన్స్‌, నిఘా అధికారులు సైబరాబాద్‌ పోలీసులను కలిశారు. ఎలాంటి డేటా చోరి జరిగింది, ఎంత మేరకు అది బయటకు వెళ్లింది, ఎవరి చేతుల్లోకి ఈ సున్నితమైన సమాచారం చేరిందనే విషయాలను అధికారులు ఆరా తీస్తున్నారు. ఏడుగురిపై ఈడీ ఇప్పటికే కేసు నమోదు చేసింది. ఇందులో ఒక మహిళ కూడా ఉన్నారు.

డేటాకు చోరికి పాల్పడే ముఠాను గత వారం సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా డేటా అమ్మడమే కాదు డేటా సేకరణలోనూ నిమగ్నమైనట్టు పోలీసులు తెలిపారు. విద్యార్థుల డేటా బేస్‌, మహిళలు, ప్రభుత్వ ఉద్యోగులు, లోన్లు, ఇన్సూరెన్స్‌, క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే వారి వివరాలన్నీ ఈ ముఠా అమ్మిందని పోలీసులు తెలిపారు. ఈ ముఠాలో కొందరు 10 రూపాయల నుంచి 40 రూపాయలకు కూడా సున్నితమైన సమాచారాన్ని అమ్మినట్టు పోలీసులు గుర్తించారు.

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు ఔట్‌ సోర్సింగ్‌ కింద సేవలందిస్తున్న ఢిల్లీకి చెందిన ఐటీ కంపెనీల పాత్ర కూడా ఈ వ్యవహారంలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. డేటా చోరిలో బ్యాంకుల్లో కీలక స్థానాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పాత్ర కూడా ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..