AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bihar: ఒకప్పుడు జిలేబీలు అమ్మిన వ్యక్తి.. నేడు వేలకోట్లకు అధిపతి.. 200 కోట్ల పన్ను ఎగవేత.. ఆస్తుల చిట్టా చూసి ఈడీ అధికారులు షాక్..

వేలకోట్ల ఆస్తిపరుడైన జేడీయూ ఎమ్మెల్యే రాధా చరణ్‌ సేథ్‌ ఎనిమిదో తరగతి వరకు చదువుకున్నాడని తెలుస్తోంది. అయితే ఇప్పుడు అతని దగ్గర చార్టర్‌ అకౌంటెంట్ల నుంచి ఎంబీఏ పాస్‌ అయిన ఎందరో  ఆయన కింద పనిచేస్తున్నారు. మొదట్లో అరా రైల్వే స్టేషన్ సమీపంలోని తన పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన జిలేబీ దుకాణంలో జిలేబీని విక్రయించేవాడు. అయితే బీహార్ ఇసుక విధానం రాధాచరణ్ సేథ్ భవితవ్యాన్ని మార్చేసింది.

Bihar: ఒకప్పుడు జిలేబీలు అమ్మిన వ్యక్తి.. నేడు వేలకోట్లకు అధిపతి.. 200 కోట్ల పన్ను ఎగవేత.. ఆస్తుల చిట్టా చూసి ఈడీ అధికారులు షాక్..
Jd(u) Mlc Radha Charan Shah
Follow us
Surya Kala

|

Updated on: Sep 14, 2023 | 1:19 PM

ఎన్ని చట్టాలు తెచ్చినా అవినీతిని అరికట్టలేక పోతున్నారు. పలు అవినీతి అధికారుల, రాజకీయ నేతల గురించి తరచుగా వార్తలు వింటూనే ఉన్నాం.. తాజాగా 200 కోట్లకు పైగా పన్ను ఎగవేత కేసులో బీహార్ జేడీయూ ఎమ్మెల్సీ రాధాచరణ్ సాహ్ అరెస్టయ్యారు. ఈడీ రాధాచరణ్ 60 బ్యాంకు ఖాతాలను కూడా స్తంభింపజేసింది. ఈరోజు రాధా చరణ్‌ను కోర్టులో హాజరుపరచనున్నట్లు సమాచారం. బుధవారం  తెల్లవారుజామున బీహార్ ముఖ్యపట్నం పాట్నాలోని రాధా చరణ్‌కు చెందిన రెండు చోట్ల, అర్రాలో నాలుగు చోట్ల ఈడీ బృందం ఏకకాలంలో దాడులు చేసింది.

రాధాచరణ్‌ ఆవరణలో అకౌంటింగ్‌ డాక్యుమెంట్లు, ఆస్తుల పత్రాలు, వ్యాపార సంబంధిత పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఖాతాలు కూడా కోడ్‌వర్డ్‌లో ఉన్నాయి.. వీటిని డీకోడ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. JDU MLC బీహార్‌లోని అనేక జిల్లాలతో పాటు ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ముంబై, బెంగళూరు, ఉత్తరాఖండ్ , జార్ఖండ్‌తో సహా అనేక రాష్ట్రాల్లో ఆస్తులను కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

ఒకప్పుడు జిలేబీ అమ్మిన వ్యక్తీ నేడు వేల కోట్లకు యజమాని

వేలకోట్ల ఆస్తిపరుడైన జేడీయూ ఎమ్మెల్యే రాధా చరణ్‌ సేథ్‌ ఎనిమిదో తరగతి వరకు చదువుకున్నాడని తెలుస్తోంది. అయితే ఇప్పుడు అతని దగ్గర చార్టర్‌ అకౌంటెంట్ల నుంచి ఎంబీఏ పాస్‌ అయిన ఎందరో  ఆయన కింద పనిచేస్తున్నారు. మొదట్లో అరా రైల్వే స్టేషన్ సమీపంలోని తన పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన జిలేబీ దుకాణంలో జిలేబీని విక్రయించేవాడు. అయితే బీహార్ ఇసుక విధానం రాధాచరణ్ సేథ్ భవితవ్యాన్ని మార్చేసింది. ఇసుక అక్రమ వ్యాపారం ద్వారా వేలకోట్ల ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు రాధా చరణ్‌పై ఉన్నాయి.

బుధవారం అర్థరాత్రి అరెస్టు

బుధవారం అర్థరాత్రి అర్రా హౌస్ లో రాదా చరణ్ ను ఈడీ అరెస్టు చేసింది. దీనికి ముందు సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అతని ఇంట్లో పూర్తి సోదాలు నిర్వహించింది. అనంతరం అరెస్టు చేశారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) నిబంధనల ప్రకారం రాదా చరణ్ ను అరెస్టు చేసినట్లు ఇడి అధికారి తెలిపారు. జేడీయూ ఎమ్మెల్సీ ఆస్తులపై ఈడీ సోదాలు చేయడం గత ఐదు నెలల్లో ఇది రెండోసారి. అంతకుముందు మే 6 న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా MLC సహా అతని సహచరులకు సంబంధించిన స్థలాలను సోదా చేసింది.

ఆగస్టు 28న సమన్లు ​​జారీ చేసిన ఈడీ

రాధాచరణ్ హోటళ్లు, రిసార్ట్‌లు, పాఠశాలల యజమాని. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆయా ప్రాంతాల్లో సోదాలు చేశారు. ఇప్పటికే రాధా చరణ్ , అతని కురుడికి వ్యతిరేకంగా ED ఆగస్టు 28 న సమన్లు ​​జారీ చేసింది. 15 రోజుల్లో పాట్నా ED కార్యాలయం ముందు హాజరు కావాలని సూచించింది. తర్వాత ఈడీ వారిద్దరినీ విచారించింది. పన్ను ఎగవేతకు సంబంధించి రాధా.. అతని సహచరుల ప్రాంగణాలపై ఈ ఏడాది ఫిబ్రవరి 7న ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసిన సంగతి తెలిసిందే..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..